»   »  కోన వెంకట్‌ని ఇంటికెళ్లి కొడతానన్న హీరోయిన్!

కోన వెంకట్‌ని ఇంటికెళ్లి కొడతానన్న హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిఖిల్ హీరోగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించిన చిత్రం ‘శంఖరాభరణం' ఈరోజు విడుదలైంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా మా టీవీ లో ప్రసారం అవుతున్న ‘మా టాకీస్' షో కి వెళ్ళిన చిత్ర యూనిట్ హోస్ట్ వ్యవహరిస్తున్న మాజీ హీరోయిన్ రాశి కామెంట్స్ విని షాకయ్యారు.

ఈ కార్యక్రమంలో కోన వెంకట్ మాట్లాడున్న సమయంలో రాశి కల్పించుకుని....పాత ‘శంఖరాభరణం' గొప్ప మూవీ, పైగా సంగీత ప్రధాన చిత్రం. మీరు చేసిన క్రైమ్ కామెడీ కథకి శంకరా భరణం లాంటి గొప్ప టైటిల్ పెట్టడం ఏంటి ? అని ప్రశ్నిస్తూనే ఒకవేళ సినిమా బాగోలేక పొతే మాత్రం మీ ఇంటికొచ్చి మరీ కొడతాను అని అనేసింది. మరి ఆ కామెంట్స్ ఆమె నోటి నుండి అనుకోకుండా వచ్చాయో? లేక రాశి కావాలనే అలా మాట్లాడిందా? అనేది హాట్ టాపిక్ అయింది.

Raasi shocking comments on kona venkat

ఈ రోజు విడుదలైన ‘శంకరాభరణం' చిత్రం టాక్ యావరేజ్ గా ఉంది. శంకరా భరణం ఏమాత్రం థ్రిల్లింగా అనిపించని క్రైమ్ కామెడీ కథ అంటూ సినీ విమర్శకులు విమర్శిస్తున్నారు. ఈ సినిమా క్రైం కామెడీ అని ప్రచారం చేయడంతో... చాలా మంది క్రైమ్ గురించి పట్టించుకోకుండా... కామెడీ ఉందనే నమ్మకంతో వెళ్లారు. అయితే తీరా వెళ్లాక సినిమాలో తగినంత కామెడీ లేదని నిరాశ పడుతున్నారు ప్రేక్షకలు.

కథ విషయానికొస్తే...
యుఎస్ లో ఉంటూ నచ్చినట్లు ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతున్న మిలియనీర్ గౌతమ్(నిఖిల్). ఓ రోజు అతని తండ్రి(సుమన్) ఊహించని విధంగా పార్టనర్స్ మోసంతో బిజినెస్ లో నిండా ములిగిపోతాడు. 12 కోట్లు అర్జెంటుగా కట్టాల్సిన పరిస్దితి వస్తుంది. డబ్బులేక... ఏం చేయలో అర్దం కాక, ఆత్మహత్య చేసుకోబోతే...సమస్య తెలుసుకున్న కొడుకు గౌతమ్...బీహార్ లో ఉన్న తన తల్లి ఆస్ది శంకరాభరణం అనే బిల్డింగ్ అమ్మి , అప్పులు నుంచి బయిటపడేద్దామని ఇండియా బయిలుదేరతాడు. నిత్యం కిడ్నాప్ లతో, అందుకు సంభందించిన గ్యాంగ్ లతో కిటకిటలాడుతున్న బీహార్ లోకి ఓ ఎన్నారై అడుగుపెట్టాడని తెలియగానే వారిలో కదలిక వస్తుంది. గౌతమ్ కిడ్నాప్ చేసి కోట్లు సంపాదించాలని ఎత్తు వేసి,అమలు చేస్తారు. తన ఆస్ది అమ్ముకుని పోదామనకున్న గౌతమ్ ఉన్నట్లుండి కిడ్నాప్ కావటంతో ... ఆ కిడ్నాప్ నుంచి డబ్బు సంపాదించాలనే ఎత్తు వేస్తాడు. అక్కడ నుంచి గౌతమ్ ఏం చేసాడు...శంకరాభరణం బిల్డింగ్ ని అమ్మాడా... తన తండ్రిని సమస్యల నుంచి బయిటపడేసాడా...కిడ్నాపైన అతని పరిస్ధితి ఏమైంది, సినిమాలో అంజలి పాత్ర ఏమిటి అనేది మిగతా కథ.

English summary
Raasi shocking comments on Tllywood star writer and Shankarabharanam producer Kona Venkat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu