»   » ‘రభస’ సెన్సార్ టెస్ట్ : పెద్దలకు మాత్రమే

‘రభస’ సెన్సార్ టెస్ట్ : పెద్దలకు మాత్రమే

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, సమంత, ప్రణీత ప్రధాన తారాగణంగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రభస' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈచిత్రానికి సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా 'A'(పెద్దలకు మాత్రమే) సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్రం ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గా విడుదలవుతోంది.

  డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ...'యూత్ ఫుల్, మాస్, ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా రూపొందిన 'రభస'ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. ఎన్టీఆర్ 'రభస'లో పక్కా మాస్ లుక్ తో ఉంటారు. యూత్ ఫుల్ స్టైల్ లో కనిపిస్తారు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంటారు. ఎన్టీఆర్ ఈ మూడు జోన్స్ ని టార్గెట్ చేసి తీస్తున్న సినిమా 'రభస'. రెండున్నర గంటల సేపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఎంజాయ్ చేసి అందరూ ఐదారుసార్లు చూసేంత ఎంటర్టెనింగుగా ఉంటుంది. బెల్లంకొండ సురేష్ మేకింగ్ రేంజ్ ఏమిటో ఈ సినిమాలో కనిపిస్తుంది' అన్నారు.

  Rabhasa Clears Censor

  ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో ప్రణీత మరో హీరోయిన్. బ్రహ్మానందం, అలీ, బ్రహ్మాజీ, నాజర్ జయసుధ, సీత, జయప్రకాష్ రెడ్డి, షాయాజీ షిండే, అజయ్, నాగినీడు, శ్రావణ్, భరత్, రవి ప్రకాష్, ప్రభాకర్, సురేఖావాణి, ప్రగతి, సత్యకృష్ణ, మీనా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

  ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఫోటోగ్రఫీ: శ్యామ్ కెనాయుడు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్: రాజుసుందరం, ప్రేమ్ రక్షిత్, శేఖర్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, విజయ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం, సమర్పణ: బెల్లంకొండ సురేష్, నిర్మాత: బెల్లంకొండ గణేష్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.

  English summary
  Junior NTR's Rabhasa, which is one of the most awaited Telugu movies of 2014, has cleared the formalities of the Regional Censor Board and got 'A' certificate on Wednesday (August 20). Now, the makers are making grand arrangements for its release across the globe on August 29. The film with 150-minute runtime will be Young Tiger's grand treat for Nandamuri fans this Ganesh Chathurthi festival.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more