»   » జూ ఎన్టీఆర్‌కు కూడా ఆ బ్యాడ్ అలవాటు ఉందా? (ఫోటోస్)

జూ ఎన్టీఆర్‌కు కూడా ఆ బ్యాడ్ అలవాటు ఉందా? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా హీరోలైనా....సామాన్య ప్రేక్షకులైనా...ఎవరైనా మనుషులే. సాదా సీదా జనాలకు ఉండే మంచి అలవాట్లతో పాటు కొన్ని చెడ్డ అలవాట్లు వారికీ ఉంటాయి. 'రభస' షూటింగులో పాల్గొన్న జూ ఎన్టీఆర్‌ను గమనిస్తే ఓ విషయం అర్థమవుతుంది. యంగ్ టైగర్‌కు కూడా గోళ్లు కొరికే బ్యాడ్ హ్యాబిట్ ఉందని.

సాధారణంగా...ఏదైనా టెక్షన్లో ఉన్నపుడు, ఏ విషయాన్ని అయినా అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నపుడు, ఎదుటి వారు చెప్పే విషయాలపై సీరియస్‌గా కాన్సన్‌ట్రేషన్ పెట్టినపుడు కొందరు వారికి తెలియకుండానే గోళ్లు కొరికేస్తుంటారు. తాజాగా జూ ఎన్టీఆర్ కూడా అదే చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంతకు మించి మరేమీ లేదు.

రభస సినిమాకు సంబంధించిన వివరాలు, సినిమా ఆన్ లొకేషన్ స్టిల్స్ స్లైడ్ షోలో....

రభస

రభస

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజాచిత్రం 'రభస'. సమంత, ప్రణీత ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌తో 'కందిరీగ' తీసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న సంతోష్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

పాట పాడిన ఎన్టీఆర్

పాట పాడిన ఎన్టీఆర్

ఈ చిత్రం కోసం కేవలం నటించడం మాత్రమే కాదు...ఓ పాట కూడా పాడారు జూ ఎన్టీఆర్. ‘రాకాసి రాకాసి' అనే సాంగును జూ ఎన్టీఆర్‌తో పాడించాడు సంగీత దర్శకుడు తమన్. గతంలోనూ జూ ఎన్టీఆర్ తన సినిమాల్లోని పాటలకు మధ్య మధ్యలో వాయిస్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాకు తొలిసారిగా పూర్తిగా పాటను పాడారు.

శర వేగంగా జరుగుతున్న పనులు

శర వేగంగా జరుగుతున్న పనులు

ఇటీవలే టాకీ పార్ట్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ బ్యాలెన్స్ పాట పూర్తి చేయడం కోసం ఇటలీ బయలుదేరారు. పాట షూటింగ్ పూర్తయ్యాక పోస్టు ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి.

వినోదాత్మక చిత్రం

వినోదాత్మక చిత్రం

ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

నటీనటులు

నటీనటులు

ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

ఆడియో డేట్

ఆడియో డేట్

జులై 27వ తేదీన శిల్ప కళా వేదికలో ఆడియో ఫంక్షన్‍‌కు ఏర్పాట్లు చేసారు.

మొత్తం ఆరు పాటలు

మొత్తం ఆరు పాటలు

ఈచిత్రానికి సంబంధించిన ఆడియో ట్రాక్ లిస్ట్ కూడా బయటకు వచ్చింది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రభస థీమ్ సాంగుతో కలుపుకుని 6 సాంగులున్నాయి.

ట్రాక్ లిస్ట్

ట్రాక్ లిస్ట్

1. లాల్ సలామ్ 2. సయ్యో సయ్యోరే 3. చెలి నిశ్చెలి 4. సరోజా సరోజా 5. రాక్షసి రాక్షసి 6. రభస థీమ్ సాంగ్

English summary
Check out Jr NTR, Samantha Ruth Prabhu and Pranitha Subhash Starer Rabhasa movie working still.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu