»   »  'రేసుగుర్రం': బన్ని పుట్టిన రోజు స్పెషల్ ట్రైలర్( వీడియో)

'రేసుగుర్రం': బన్ని పుట్టిన రోజు స్పెషల్ ట్రైలర్( వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోగా పదేళ్ల నుంచి అల్లు అర్జున్ ప్రయాణం కొనసాగుతోంది. నటుడిగా ఎంతో పరిణతి సాధించాడు. స్టార్‌ హీరోగా నిలబడ్డారు. ఇటీవలే తండ్రిగా ప్రమోషన్‌ పొందిన ఆయన... ఈ నెల 11న 'రేసుగుర్రం'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మంగళవారం పుట్టిన రోజు జరుపుకొంటున్న అల్లు అర్జున్‌ కి శుభాకాంక్షలు తెలియచేస్తూ రేసు గుర్రం కొత్త ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ లింక్ ని మీకోసం అందిస్తున్నాం.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.... ''నా జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా ఇది. సురేందర్‌ రెడ్డి చాలా బాగా తీశారు. పరిశ్రమలో ప్రతి దర్శకుడు సినిమాతోపాటు నా హీరో బాగుండాలని కోరుకుంటాడు. వాళ్ల అభిరుచి వల్లే మేము తెరపై ఇంత అందంగా కనిపిస్తుంటాం. 'కిక్‌', 'బృందావనం' పాటలు విన్నాక తమన్‌తో పని చేయాలనిపించింది. ప్రపంచ స్థాయి సంగీతం తన దగ్గర ఉంటుంది.'' అన్నారు.

Race Gurram - Allu Arjun's birthday special trailer

సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ... ''తెరపై బన్నీ రేసుగుర్రమైతే తెరవెనుక చిత్రబృందమంతా రేసుగుర్రాల్లా పరుగెత్తి పని చేశారు. తమన్‌ తన పాటలతో నాకు రెండింతలు కిక్‌ ఇచ్చాడు. ఈ సినిమా విజయం ఎప్పుడో ఖరారైంది. ప్రజల చప్పట్ల కోసమే ఎదురు చూస్తున్నా'' అన్నారు.

'రేసుగుర్రం'... ఆ పేరు వినగానే 'భలే ఉందే, అల్లు అర్జున్‌ తీరుకు తగ్గట్టే ఉంది' అన్నారంతా. నిజంగా... అల్లు అర్జున్‌ రేసుగుర్రంలాంటోడు. ఆయన మాటలో వేగం, నటనలో హుషారు. కెమెరా స్టార్ట్‌ అయితే చాలు... అందులో రీలుతో పోటీపడి నటిస్తుంటాడు. కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/Cowiq549H1E?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Race Gurram will come to theatres on the 11th of April. Shruti Haasan is the leading lady of this film which is directed by Surender Reddy. S S Thaman has scored the music of this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu