»   » 'రేసుగుర్రం' ఆడియో వేడుక విశేషాలు(ఫోటో ఫీచర్)

'రేసుగుర్రం' ఆడియో వేడుక విశేషాలు(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రేసుగుర్రం'. శ్రుతిహాసన్‌ హీరోయిన్. సురేందర్‌రెడ్డి దర్శకుడు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'రేసుగుర్రం' పాటల విడుదల వేడుకలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమన్‌ స్వరాలందించారు. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), డా||కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు.

చిరంజీవి మాట్లాడుతూ... ''బన్నీ హీరో కావాలని కోరుకున్న మొదటి వ్యక్తిని నేను. 'డాడీ'చిత్రంలో డ్యాన్స్‌ వేసే కుర్రాడి పాత్ర కోసం అనుకుంటే అల్లు అర్జునే గుర్తొచ్చాడు. ఆ ఒకటిన్నర నిమిషం సన్ని వేశంతో ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం బన్నీకి ఉన్నాయి. అవే అతనికి మంచి ఫలితాల్నిస్తున్నాయి. సురేందర్‌ రెడ్డి తీసిన 'కిక్‌' సినిమాని ఇటీవలే టీవీలో చూశాను. చాలా నచ్చింది. ఆ సమయంలో నేను రవితేజలా ఉండుంటే ఆ సినిమాని నేనే చేసేవాడినేమో అనిపించింది. చాలా మంచి దర్శకుడు సురేందర్‌రెడ్డి'' అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ "బన్ని కెరీర్‌లో ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే ఉంటుంది. వినోదం, యాక్షన్‌ మేళవించిన కథ ఇది. టైటిల్‌కి తగ్గట్టే.. హుషారుగా సాగిపోతుంది'' అని అన్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఆడియో విశేషాలు స్లేడ్ షో లో...

ఆవిష్కరణ...

ఆవిష్కరణ...

తొలి సీడీని చిరంజీవి ఆవిష్కరించారు. దర్శకుడు వి.వి.వినాయక్‌ స్వీకరించారు.

ఆప్ ని ...

ఆప్ ని ...

అల్లు అర్జున్‌ గురించి సమాచారాన్ని తెలిపే ఓ ఆప్‌ని కూడా ఇదే వేదికపై విడుదల చేశారు.

చిరు మాట్లాడుతూ...

చిరు మాట్లాడుతూ...

'''ఈ సినిమాకి రేసుగుర్రం' అనే పేరు బాగా కుదిరింది. ఎందుకంటే బన్నీ రేసుగుర్రంలాంటి కుర్రాడు. ఈ పేరు బన్నీకి తప్ప మరెవరికీ నప్పదు. అంత హుషారుగా ఉంటాడు బన్నీ. ఇదివరకు మా ఇంట్లో ఏ వేడుక జరిగినా తన డ్యాన్స్‌లు, అనుకరణలతో మమ్మల్ని సంతోషపెట్టేవాడు. అప్పుడే బన్నీ హీరో కావాల్సిన వ్యక్తి అనిపించింది'' అన్నారు.

పైరసీ గురించి చెప్తూ...

పైరసీ గురించి చెప్తూ...

''సినిమాకి సంబంధించిన ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో కష్టపడి తీస్తారు. దానివెనుక వందలమంది శ్రమ ఉంటుంది. ఈ విషయం తెలుసుకోకుండా పైరసీకి పాల్పడుతున్నారు. ఈ సినిమా ఆడియో విడుదలకు ముందే అంతర్జాలంలో పెట్టారని విన్నాను. ఇది నీచమైన పని. బాధ్యతగల ప్రతి ఒక్కరూ ఇలాంటి చోరులకు గుణపాఠం చెప్పాలి. ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించి పైరసీ నిర్మూలనకు కృషి చేయాలి'' అంటూ పైరసీ గురించి చెప్పారు చిరంజీవి.

చిత్ర పరిశ్రమలో నిర్మాతల పరిస్థితి గురించి చిరంజీవి మాట్లాడుతూ.....

చిత్ర పరిశ్రమలో నిర్మాతల పరిస్థితి గురించి చిరంజీవి మాట్లాడుతూ.....

''నిర్మాత లేకపోతే సినిమానే లేదు. ప్రతి ఒక్కరూ నిర్మాత బాగోగులు చూసి నడుచుకోవాలి. నిర్మాతకు విలువనిచ్చినప్పుడే పరిశ్రమ నిలబడుతుంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు కలిసి చేసిన ఈ చిత్రం మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా'' అన్నారు.

వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ....

వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ....

''బన్నీ, చరణ్‌ డ్యాన్స్‌లు చూస్తే నాకు అన్నయ్య చిరంజీవి గుర్తుకొస్తుంటారు. ఇందులో ఓ స్టిల్‌లో బన్నీని చూస్తే 'ఘరానా మొగుడు'లో చిరంజీవిలా అనిపించాడు. ఈ సంస్థతో నాకు మరపురాని అనుబంధం ఉంది. ఇందులో బన్నీ 'నేను రేసుగుర్రాన్ని' అంటూ చెప్పిన డైలాగ్‌ నాకు బాగా నచ్చింది'' అన్నారు.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ....

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ....

''నా జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా ఇది. సురేందర్‌ రెడ్డి చాలా బాగా తీశారు. పరిశ్రమలో ప్రతి దర్శకుడు సినిమాతోపాటు నా హీరో బాగుండాలని కోరుకుంటాడు. వాళ్ల అభిరుచి వల్లే మేము తెరపై ఇంత అందంగా కనిపిస్తుంటాం. 'కిక్‌', 'బృందావనం' పాటలు విన్నాక తమన్‌తో పని చేయాలనిపించింది. ప్రపంచ స్థాయి సంగీతం తన దగ్గర ఉంటుంది.'' అన్నారు.

శ్రుతి గురించి బన్నీ చెప్తూ...

శ్రుతి గురించి బన్నీ చెప్తూ...

శ్రుతిహాసన్‌ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. 'ఇంత పెద్ద స్టార్‌ కూతురివి. అందమైన అమ్మాయివి. సరదాగా షాపింగ్‌లు చేస్తూ ఇంట్లో ఉండక సినిమాలు ఎందుకు' అని ఓసారి శ్రుతితో అన్నాను. ''నా కాళ్ల మీద నేను నిలబడాలి'' అని సమాధానం చెప్పింది శ్రుతి. ఆమెకి సినిమా అంటే పిచ్చి'' అన్నారు.

సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ...

సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ...

''తెరపై బన్నీ రేసుగుర్రమైతే తెరవెనుక చిత్రబృందమంతా రేసుగుర్రాల్లా పరుగెత్తి పని చేశారు. తమన్‌ తన పాటలతో నాకు రెండింతలు కిక్‌ ఇచ్చాడు. ఈ సినిమా విజయం ఎప్పుడో ఖరారైంది. ప్రజల చప్పట్ల కోసమే ఎదురు చూస్తున్నా'' అన్నారు.

తమన్‌ మాట్లాడుతూ...

తమన్‌ మాట్లాడుతూ...

''అల్లు అర్జున్‌ అంటే హుషారుకి ప్రతిరూపం. అందుకు తగ్గట్టుగానే సంగీతమందించాను. ఈ చిత్రంలో బన్నీ డ్యాన్స్‌లు అదిరిపోతాయి'' అన్నారు.

నిర్మాత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...

నిర్మాత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...

''14 ఏళ్ల తర్వాత నన్ను నిర్మాతగా మళ్లీ వేదిక ఎక్కించాడు అల్లు అర్జున్‌. అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అన్నారు.

ఎవరెవరు...

ఎవరెవరు...

ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతోపాటు అల్లు అరవింద్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అలీ, సి.కల్యాణ్‌, శరత్‌ మరార్‌, జెమిని కిరణ్‌, మారుతి, ఎన్వీ ప్రసాద్‌, బీవీఎస్‌ఎన్‌ప్రసాద్‌, వంశీ పైడిపల్లి, బి.గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

కొత్త విలన్...

కొత్త విలన్...

ఈ చిత్రంలో విలన్ గా...భోజపురి హీరో రవి కిషన్ చేస్తున్నారు. రవికిషన్ ఈ చిత్రంలో శివారెడ్డి అనే పాత్రను పోషిస్తున్నారు. అతని పాత్ర ఓ రాజకీయనాయకుడుది అని తెలిస్తోంది. ఈ మేరకు రవికిషన్, అల్లు అర్జున్ పై సన్నివేసాలను అన్నపూర్ణా స్టూడియోలో నిన్న షూట్ చేసారు. ఈ చిత్రం విడుదల అయ్యాక తెలుగులోనూ పూర్తి బిజీ అవుతాననే నమ్మకంగా ఉన్నారు రవి కిషన్.

టైటిల్ జస్టిఫికేషన్ ...

టైటిల్ జస్టిఫికేషన్ ...

ఒక్కసారి రేసు గుర్రం పరిగెట్టడం మొదలుపెట్టిందంటే విజయం సాధించేదాకా పరిగెడుతూనే ఉంటుంది. అటువంటి వేగంగా పరిగెత్తే గుర్రాన్ని చూస్తే ఎవరికైనా దాన్న ఎక్కి అందరికన్నా ముందు అనుకున్న చోటికి చేరాలని వుం టుంది. ఇదే అంశాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి తన చిత్రంలో చూపబోతున్నారు

తెరవెనుక...ముందు

తెరవెనుక...ముందు

కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

English summary
Allu Arjun starrer Racegurram audio launched on March 16th in Hyderabad. S S Thaman is composing the music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu