»   » కేక పుట్టిస్తున్న ‘రేస్ గుర్రం’ న్యూ పోస్టర్ (ఫోటో)

కేక పుట్టిస్తున్న ‘రేస్ గుర్రం’ న్యూ పోస్టర్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్-శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రేస్ గుర్రం'. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. మరోసారి బన్నీ మాస్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోబోతున్నాడని ఈ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది.

ముందుగా అనుకున్న ప్రచారం ఈ సినిమా ఆడియో ఈ రోజు విడుదల కావాల్సి ఉండగా...ఇదే రోజు పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ఆవిర్భావ సభ ఉండటంతో 16వ తేదీకి ఆడియో విడుదల వాయిదా వేసారు. ఈ సినిమా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శృతి హసన్, సలోని హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.

Race Gurram new poster

కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

English summary
Race Gurram new poster releades. The film directed by Surender Reddy starring Allu Arjun, Shruti Haasan, Saloni Aswani and Shaam. Nallamalapu Srinivas (Bujji) and Dr. Venkateswara Rao are producing this film under Lakshmi Narasimha production and S. Thaman provided the music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu