»   »  ‘రేస్ గుర్రం’ చిత్రం విడుదల ఎప్పుడంటే?

‘రేస్ గుర్రం’ చిత్రం విడుదల ఎప్పుడంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రేస్ గుర్రం'. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు. షూటింగ్ ఇంకా చాలా వరకు మిగిలి ఉన్నప్పటికీ....శరవేగంగా షూటింగ్ జరుపాలని నిర్ణయించారు.

'రేస్ గుర్రం' చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్ సంగీతం అందిస్తున్నారు. తమన్ ఇచ్చిన మ్యూజిక్‌పై తన అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు అల్లు అర్జున్. ఫేస్‌బుక్‌లో అల్లు అర్జున్ స్పందిస్తూ...'రేస్ గుర్రం చిత్రం కోసం తమన్ ఎక్సలెంట్ సాంగ్స్ ఇచ్చాడు. సినిమా ఆడియో విడుదల ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పాటలు సూపర్ హిట్టవడం ఖాయం' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

కిక్‌ సినిమాతో హిట్ కొట్టి స్టార్ దర్శకుడిగా మారిన సురేందర్ రెడ్డి, ఆ తర్వాత ఊసరవెల్లితో బోల్తా పడ్డాడు. అయితే ఈచిత్రంతో ఎలాగైనా హిట్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది.

నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

English summary
Allu Arjun's Race Gurram movie makers are targeting a January release for the movie, possibly for Sankranthi. Surender Reddy is the director of ‘Race Gurram’ and Nallamalapu Bujji is the producer. Manoj Paramahamsa is handling the cinematography.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu