»   » స్టైలిష్ ఫన్ ('రేసుగుర్రం' ప్రివ్యూ)

స్టైలిష్ ఫన్ ('రేసుగుర్రం' ప్రివ్యూ)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : దర్శకుడుగా సురేంద్ర రెడ్డి కి మంచి గుర్తింపు ఉంది...ఆయన సినిమా కోసం ఎదురుచూసే ప్రేక్షకులు ఉన్నారు. అలాగే అల్లు అర్జున్ కుటుంబ ప్రేక్షకులతో సహా యూత్ లో ఓ రేంజిలో అభిమానులు ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే ఖచ్చితంగా ఫన్, స్టైల్, యాక్షన్ కలగలిపిన ఎంటర్టైన్మెంట్ ని ఆశిస్తారు. అలాంటి విందే 'రేసుగుర్రం' తో అందిస్తామని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. అందులోనూ సురేంద్రరెడ్డికి ఇప్పుడు హిట్ అవసరమైన సమయం...దాంతో చాలా కసితో ఈ చిత్రం రూపొందించాడని వినిపిస్తోంది. అంచనాలను అందుకుంటుందా లేదా అనేది ఈ రోజు తేలనుంది.

  ఈ చిత్రంలో అల్లు అర్జున్ లక్కీగా కనపించనున్నారు. అతని అన్న (కిక్ శ్యామ్ )పోలీస్ అథికారితో ఎప్పుడూ తగాదా పడుతూంటాడు. అయితే వీరి తల్లికి ఇది నచ్చదు. అయితే అనుకోని విధంగా అన్నకి మినిస్టర్ (రవికిషన్ ) నుంచి థ్రెట్ ఎదురు అవుతుంది. అప్పుడు తన అన్నని తన తెలివితో ఎలా ఆ సమస్య నుంచి బయిటపడేసాడన్నది వినోదాత్మకంగా చెప్పబడిన కథ . చివరి ఇరవై నిముషాలు రేసిగా,ఫుల్ ఫ్యాక్ గా ఉండి అలరించనుంది.

  Race Gurram Telugu Movie - Preview

  ఈ సినిమాలో హైలెట్స్...

  శృతిహాసన్, అల్లు అర్జున్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్
  అల్లు అర్జున్ చెప్పే పంచ్ డైలాగ్స్
  కిక్ శ్యామ్ దగ్గర అల్లు అర్జున్ చేసే అల్లరి, తగువులు
  మనోజ్ పరమహంస స్టైలిష్ సినిమాటోగ్రఫీ
  తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  బ్రహ్మానందం కామెడీ

  అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.... ''నా జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా ఇది. సురేందర్‌ రెడ్డి చాలా బాగా తీశారు. పరిశ్రమలో ప్రతి దర్శకుడు సినిమాతోపాటు నా హీరో బాగుండాలని కోరుకుంటాడు. వాళ్ల అభిరుచి వల్లే మేము తెరపై ఇంత అందంగా కనిపిస్తుంటాం. 'కిక్‌', 'బృందావనం' పాటలు విన్నాక తమన్‌తో పని చేయాలనిపించింది. ప్రపంచ స్థాయి సంగీతం తన దగ్గర ఉంటుంది.'' అన్నారు.

  సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ... ''తెరపై బన్నీ రేసుగుర్రమైతే తెరవెనుక చిత్రబృందమంతా రేసుగుర్రాల్లా పరుగెత్తి పని చేశారు. తమన్‌ తన పాటలతో నాకు రెండింతలు కిక్‌ ఇచ్చాడు. ఈ సినిమా విజయం ఎప్పుడో ఖరారైంది. ప్రజల చప్పట్ల కోసమే ఎదురు చూస్తున్నా'' అన్నారు.

  బ్యానర్ :శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్
  నటీనటులు: అల్లు అర్జున్, శృతి హాసన్, సలోని, కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు
  రచన: వక్కంతం వంశీ,
  కెమెరా: మనోజ్ పరమహంస,
  సాహిత్యం: చంద్రబోస్, వరికుప్పల యాదగిరి, విశ్వ
  సంగీతం: ఎస్.తమన్,
  కూర్పు: గౌతంరాజు,
  నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు,
  విడుదల తేదీ: 11, ఏప్రియల్ 2014

  English summary
  Race Gurram has made in Bunny's regular style and it has all masala ingredients like romance, action, comedy, music, dance, beautiful locales and trendy costumes. Race Gurram is a big-ticket commercial entertainer, which has been produced by Nallamalapu Srinivas (Bujji) and Dr Venkateswara Rao under the banner of Sri Lakshmi Narasimha Productions.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more