twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రచ్చ 'వానా వానా వెల్లువాయే' పాట వివాదం

    By Srikanya
    |

    ఇరవై ఏళ్ల క్రితం 'గ్యాంగ్ లీడర్' సినిమాలో చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన 'వానా వానా వెల్లువాయే' పాటను తాజాగా రామ్ చరణ్ తన 'రచ్చ' సినిమాలో రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా హిట్ లో సింహ భాగం ఈ పాట ఆక్రమించింది అని దర్శక,నిర్మాతలు సైతం ఒప్పుకున్నారు. అయితే ఈ పాట మూల రచయిత భువనచంద్రకు రెమ్యునేషన్ ఇవ్వలేదు. దాంతో ఆయనకు రెమ్యునేషన్ ఇవ్వాలని నోటీస్ ఇవ్వటం జరిగింది.

    రైటర్స్ అశోశియేషన్ వారు నిర్మాత ప్రసాద్ కు లిరికిస్ట్ భువనచంద్రకు ఈ పాట నిమిత్తం పే చెయ్యమని నోటీస్ సర్వ్ చేసారు. అయితే నిర్మాతలు ఇవ్వటానికి ఒప్పుకోవటం లేదు. సాధారణంగా ఓ పాటని రీమిక్స్ చేస్తున్నప్పుడు ఆ పాట మూల రచయిత సాహిత్యాన్ని వాడుకున్నట్లయితే,అనుమతి తీసుకోవటమే కాకుండా తగిన రెమ్యునేషన్ ఇవ్వటం అనేది చాలా కాలంగా జరుగుతోంది. అయితే ఆడియో కంపెనీ నుంచి రైట్స్ తీసుకుని పాట రీమిక్స్ చేసామని నిర్మాత చెప్పటం విశేషం.

    ఈ విషయమై రైటర్స్ అశోశియేషన్ జనరల్ సెక్రటరీ ఆకెళ్ల గారు మాట్లాడుతూ...మేము నిర్మాతకి,సినీ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కి ఈ ఇష్టాను తీసుకు వెళ్లాం. అయితే నిర్మాత తాను గ్యాంగ్ లీడర్ ఆడియో మార్కెట్ చేసిన ఆడియో కంపెనీ నుంచి రీమిక్స్ రైట్స్ తీసుకున్నామంటున్ారు. అయితే కొత్త కాపీరైట్స్ ఎమెండ్ మెంట్ చట్టం ప్రకారం రచయితకు ప్రతీసారీ రెమ్యునేషన్ తీసుకునే హక్కు ఉంటుంది. కొందరు నిర్మాతలు దాన్ని ఇగ్నోర్ చేసినప్పటికీ మేము ఈ విషయమై నిర్మాతల మండలి వారిని మీటింగ్ పెట్టమని కోరుతున్నాం అన్నారు.

    English summary
    
 The Writers’ Guild has served a notice on Prasad to pay lyricist Bhuvanachandra for using his song Vaana Vaana in Rachcha. “We have written to producer as well as to the AP Film Employees Federation to sort out the issue. The producer claims that he had got the right to remix the song from the audio company which marketed the film Gang Leader’s audio” says Akella, general secretary of AP Cine Writers Association.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X