For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను పాదయాత్ర చేస్తాను.. మైక్ పట్టుకొని విషయం తెలుసుకొంటా.. జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు

  By Rajababu
  |

  దుహర మూవీస్ సమర్పించు చిత్రం "రచయిత". ఈ చిత్ర ఆడియో విడుదల సోమవారం హైదరాబాద్ మణికొండ లోని పాటల రచయిత చంద్రబోస్ నివాసం లో నటుడు జగపతిబాబు సమక్షంలో చంద్ర బోస్ పాడి వినిపించడం తో ఈ ఆడియా విడుదల జరిగింది. ఈ కార్యక్రమంలో జగపతిబాబు, సంగీత దర్శకుడు శ్యామ్, రచయిత చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

  నా మిత్రుడు తీసిన సినిమా కోసం

  నా మిత్రుడు తీసిన సినిమా కోసం

  అనంతరం జగపతిబాబు మాట్లాడుతూ.. "నాకు రచయితలంటే చాలా గౌరవం. "రచయిత" అనే సినిమా సస్పెన్సు థ్రిల్లర్ తో తెరకెక్కనుంది. ఈ సినిమా కాన్సెప్ట్ నాకు విపరీతంగా నచ్చడం తో మొదట నేనే నటించాలనుకున్నా కానీ నా డేట్స్ కుదరకపోవడం చేత చేయలేకపోయాను. ఈ చిత్ర దర్శకుడు నా మిత్రుడు తను మంచి సినిమా తీసాడనే ఉద్దేశ్యం తోనే చిన్న సినిమా బ్రతకాలనే తపనతోనే నా ఫేస్ బుక్ ద్వారా ఈ పాటలను విడుదల చేయడం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమా కోసం నేను వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాను.. పెద్ద వారు పెద్దగా ఎదుగుతున్నారు, కానీ చిన్నవారు ఎప్పటికీ చిన్నవారిలానే ఉండిపోతున్నారు అనే ఆవేదన తోనే నేనే సపోర్ట్ చేయడం జరుగుతోంది.

  రచయిత ఇంట్లోనే రచయిత ఆడియో

  రచయిత ఇంట్లోనే రచయిత ఆడియో

  అన్నీ సినిమాలకు ఆడియో వేడుక సాధారణంగా జరుగుతుంది కానీ ఈ చిత్ర టైటిలే "రచయిత" కనుక ఈ చిత్రానికి పాటలు రచించిన చంద్రబోస్ ఏ సీట్ లో అయితే ఈ సినిమా పాటలు పుట్టించాడో ఆదే సీట్ లో విడుదల చేయాలని నిర్ణయించుకొని చంద్ర బోస్ నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని జగపతి బాబు అన్నారు.

  8న థియేటర్లో ప్రివ్యూ ప్రదర్శన

  8న థియేటర్లో ప్రివ్యూ ప్రదర్శన

  రచయిత సినిమాకు ప్రీ రిలీజ్ వేడుక చేయకుండా డైరెక్ట్‌గా పబ్లిక్‌కు చేరేలా డిసెంబర్ 8న ఒక థియేటర్లో సినిమాను ప్రదర్శింప చేసి నేనే స్వయంగా థియేటర్ బయట మైక్ పట్టుకు నిల్చొని ప్రేక్షకుల అభిప్రాయాన్ని తెలుకోవాలనుకొంటున్నాను. ఇదంతా నా మిత్రుడు సాగర్ చేసిన మంచి ప్రయత్నం కోసమే. ఇప్పుడు విడుదలైన మూడు పాటలలో నాకు "ఏ ఎదలో ఏముంటుందో" అనే పాట నాకు బాగా నచ్చింది" అని జగపతిబాబు అన్నారు.

  సినిమాను బతికించేందుకు

  సినిమాను బతికించేందుకు

  పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. "చిన్న సినిమాను బ్రతికించాలనే తపనతోనే హీరో, నటుడు జగపతిబాబు గారు తన సహాయసహకారాలు అందజేస్తున్నారు.. పాటలు రచించడానికి నేను ఎక్కడికీ వెళ్ళను నా ఇంట్లోనే ఈ సీట్ లొనే రాస్తాను. అందుకే ఈ సినిమా పాటలు ఇక్కడ జగపతిబాబు గారి సమక్షంలో నిర్వహిస్తున్నాం, 22 ఏళ్ల నా కెరీర్లో 800 పాటలు రాసాను, కానీ చాలా నచ్చిన పాటలు మాత్రం ఈ రచయిత సినిమా పాటలే. ఈ చిత్రంలో 3 పాటలున్నాయి. మూడు కూడా సందర్భానుచితంగా ఉంటాయి. ఆ పాటలు నేను ఇప్పుడు పాడి విడుదల చేస్తాను. మొదటి పాట ఏ ఎదలో ఏముందో రెండో పాట నల్ల రంగు మబ్బులో, మూడవ పాట రానా ప్రియా చిరునవ్వులో ఈ గీతాలకు సంగీతం అందించింది శ్యామ్ మలయాళ సంగీత దర్శకుడు" అన్నారు.

  నటీనటులు, సాంకేతికవర్గం

  నటీనటులు, సాంకేతికవర్గం

  విద్యాసాగర్ రాజు, సంచిత పదుకొనే, శ్రీధర్ వర్మ, వడ్లమాని శ్రీనివాస్, హిమజ, ముణిచంద్ర, అభిలాష్, రాగిణి, సంజిత్, సుప్రియ, అన్ మోనా, అనిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, కళ: రాము, సంగీతం: షాన్ రెహమాన్, నేపధ్య సంగీతం: జీవన్ (జెబి), మాటలు: కరుణాకర్ అడిగర్ల, పాటలు: చంద్రబోస్, కూర్పు: ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, నిర్మాత: కళ్యాణ్ ధూళిపాళ్ళ, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-డైరెక్షన్: విద్యాసాగర్.

  English summary
  Concept movie Rachayitha Audio Launched by Actor Jagapathi Babu at writer Chandra Bose residence on November 27th. This movie is directed by Vidya Sagar. produced by Dhoolipala Kalyan. This movie will hit theatre soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X