twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నవంబర్ 12న చైనాకి రామ్ చరణ్

    By Srikanya
    |

    రామ్ చరణ్ నవంబర్ 12 వ తేదీ న చైనా వెళ్లనున్నారు.అక్కడ ఓ అటవీ ప్రాంతంలో తాను చేస్తున్న రచ్చ షూటింగ్ కి సంభంధించి కొన్ని కీలక సన్నివేశాలు,ఫైట్స్ చిత్రీకరించనున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ లో చరణ్,తమన్నాలపై ఓ సాంగ్ ని షూట్ చేస్తున్నారు.రామ్ చరణ్ తన తాజా చిత్రం రచ్చ గురించి మాట్లాడుతూ....ఈ చిత్రం టాలీవుడ్ లో ఓ ఉదాహణగా నిలిచిపోతుంది. తక్కువ ప్రొడక్షన్ కాస్ట్ తో ఎంత ఎక్కువ సినిమాటెక్ వ్యాల్యూస్ తో తీయవచ్చు అనే విషయంలో. మేము ఈ సినిమా పూర్తికాగానే ఎంత ఖర్చు అయ్యింది..ఎలా ఖర్చు పెట్టాం అనే విషయాలను తెలియచేస్తాం అన్నారు రామ్ చరణ్.అలాగే తెలుగులో బడ్జెట్ లు పెరిగిపోతున్నాయనే మాట నిజం. మార్కెట్ డిమాండ్ ని మించి ఖర్చు పెడుతున్నారు. ఆ తర్వాత డెఫిషిట్ లో విడుదల చేసి బాధపడుతున్నారు.దానికి కారణం చాలా మంది నిర్మాతలు సెట్స్ కు కూడా రావటం లేదు. మేము మా నిర్మాతలకు ఒకటే చెప్తున్నాం. మీకు డబ్బు రియల్ ఎస్టేట్ లేదా వేరే వ్యాపారాల మీద ఖర్చు పెట్టుకోండి అంతేగానీ ప్యాశన్ లేకుండా పరిశ్రమకు రావద్దు బాధపడద్దు అంటున్నాం అన్నారు.

    ఇక రచ్చ దర్శకుడు సంపత్ నంది గురించి చెపుతూ..నేను చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను..అలాంటి పాత్రను నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. నా ఫ్యాన్స్ నానుంచి ఎలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేస్తారో ఖచ్చితంగా అలాంటిదే ఇది. ఈ స్క్రిప్టుని సంపత్ నంది చాలా జాగ్రత్తగా వర్క్ చేసి తెరకెక్కిస్తున్నారు. అతను చాలా ప్రతిభావంతంగా పనిచేస్తున్నాడు అన్నారు. ఇక రచ్చ చిత్రాన్ని క్రిసమస్ కానుకగా విడుదల చేయాలని రామ్ చరణ్ చెప్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.

    English summary
    Ram Charan's Rachcha is all set to move to China to can a key action sequence there in a deep forest. From November 12, the unit will film the action episode at a virgin location in a deep forest in China.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X