twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రచ్చ’ రిలీజ్ అక్కడ ఒకరోజు లేటుగా!

    By Bojja Kumar
    |

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'రచ్చ' సినిమా రేపు(ఏప్రిల్ 5)న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రాన్ని తెలుగులో పాటు తమిళం, మలయాళం భాషల్లోనూ అనువదించి విడుదల చేస్తున్నారు. తమిళంలో 'రగలై' పేరుతో, మలయాళంలో 'రక్ష' పేరుతో విడుదల చేస్తున్నారు.

    అయితే ఈ చిత్రం తమిళనాడు, కేరళల్లో ఒక రోజు లేటుగా ఏప్రిల్ 6న విడుదల అవుతోంది. మరో వైపు ఈచిత్రాన్ని కర్నాటకలోనూ విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇంకా అక్కడ డేట్ ఖరారు కాలేదు. కన్నడలోకి అనువాదం చేసేందుకు అక్కడ నిబంధనలు ఒప్పుకోవు కాబట్టి తెలుగులోనే విడుదల కానుంది.

    సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా నటిస్తోంది. ఈచిత్రంలో చెర్రీ మెడికల్ స్టూడెంట్‌గా కనిపించబోతున్నారు. రామ్ చరణ్ గత సినిమాల కంటే భిన్నంగా పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా యాక్షన్ ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ 'వాన వాన వెల్లువాయె' ఇందులో రీమేక్ చేశారు. ఈ పాటలో చెర్రీ తండ్రి చిరంజీవి స్టెప్పులను అనుకరించడంతో అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

    రచ్చ చిత్రాన్ని మెగా సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై ఆర్‌.బి. చౌదరి సమర్పకులుగా ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్ నిర్మిస్తున్నారు. మణి శర్మ ఈచిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్‌, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి

    English summary
    Ram Charan Rachcha is being dubbed in Tamil and Malayalam. In Tamil, the film has been titled as Ragalai and in Malayalam it is named as Raksha. the makers of Rachcha have decided to release both the versions on April 6. Rachcha directed by Sampath Nandi and produced by NV Prasad, Paras Jain.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X