»   » అజ్ఞాతవాసి చేసిన పని.. టాలీవుడ్ కు కొత్త చిక్కులు..!

అజ్ఞాతవాసి చేసిన పని.. టాలీవుడ్ కు కొత్త చిక్కులు..!

Subscribe to Filmibeat Telugu

అజ్ఞాతవాసి జ్ఞాపకాలనుంచి పవన్ కళ్యాణ్ త్వరగానే బయట పడి పాలిటిక్స్ లో బిజీ అయిపోయాడు. దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ మాత్రం ఆ సమస్యలతోనే సతమతం అవుతున్నారు. బయ్యర్ల పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో అజ్ఞాతవాసి చిత్రం ఒకటిగా నిలిచింది. నిర్మాత రాధాకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బయ్యర్లు ఆదుకునే ప్రయత్నం చేసారంటూ ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. వీళ్ళిద్దరూ చేస్తున్న పని ఇప్పుడు టాలీవుడ్ లోని మిగిలిన నిర్మాతలకు చిక్కులు తెచ్చిపెట్టేదిగా ఉందని చర్చ జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ మొదలు పెట్టాడు

పవన్ కళ్యాణ్ మొదలు పెట్టాడు

నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ లకు డబ్బు తిరిగి చెల్లించే విధానం గతంలో పవన్ కళ్యాణ్ మొదలు పెట్టాడు. తన సినిమా వలన నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ లకు పవన్ కళ్యాణ్ గతంలో తన రెమ్యునరేషన్ ని తిరిగి ఇచ్చిన ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి.

అజ్ఞాతవాసి లాస్ అంతా ఇంతా కాదు

అజ్ఞాతవాసి లాస్ అంతా ఇంతా కాదు

అజ్ఞాతవాసి చిత్రం దాదాపు 120 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ఈ చిత్రం కనీసం 40 శాతం కూడా రికవరీ చేయలేకపోయింది. భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన బయ్యర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

 సర్దార్, కాటమరాయుడు కూడా అదే పరిస్థితి

సర్దార్, కాటమరాయుడు కూడా అదే పరిస్థితి

కాటమరాయుడు, సర్దార్ చిత్రాల ద్వారా నష్టపోయిన బయ్యర్లు కొందరు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి చిత్రంతో పవన్ పై ఇంకా ఒత్తిడి పెరుగుతుందని అంతా భావించారు. కానీ నిర్మాత రాధా కృష్ణ అందరికి ఆదర్శంగా నిలిచారు. దాదాపు 22 కోట్ల రూపాయలని బయ్యర్లకు తిరిగి ఇచ్చేసారు.

 టాలీవుడ్ లో తొలి నిర్మాత

టాలీవుడ్ లో తొలి నిర్మాత

గతంలో బయర్లని ఆదుకోవడానికి హీరోలు, డైరెక్టర్ లు తమ రెమ్యునరేషన్ ని వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ నిర్మాత డబ్బులు వెనక్కి ఇవ్వడం మాత్రం ఇదే తొలిసారి. ఆ కోవలో ఆదర్శంగా నిలిచిన తొలి నిర్మాత రాధాకృష్ణ అయ్యారు.

 మిగిలిన నిర్మాతల్లో గుబులు

మిగిలిన నిర్మాతల్లో గుబులు

రాధాకృష్ణ చర్యలతో మిగిలిన నిర్మాతల్లో గుబులు మొదలైంది. తమ చిత్రాలకు కూడా సరిగా ఆడకుండా బయ్యర్లకు నష్టాలు వచ్చి, రాధాకృష్ణ లాగా డబ్బు వెనక్కి ఇవ్వాలని కోరితే తమ పరిస్థితి ఏంటని వారంతా వాపోతున్నారు. రాధాకృష్ణ వరుసగా విజయాలు సాధించారు కాబట్టి అజ్ఞాతవాసి ప్లాపైనా డబ్బు వెనక్కి ఇవ్వగలిగారు. అరకొర విజయాలు ఉన్న మిగిలిన నిర్మాతల పరిస్థితి ఏంటని టాలీవుడ్ లో కొందరు గగ్గోలు పెడుతున్నారు.

English summary
Radha Krishna compensation to the Agnyaathavaasi buyers. Remaining producers are in dilemma
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu