»   »  వంగవీటి వివాదం: వర్మపై హైదరాబాదులో కేసు, బెజవాడలో ధర్నా

వంగవీటి వివాదం: వర్మపై హైదరాబాదులో కేసు, బెజవాడలో ధర్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

వంగవీటి సినిమాపై రామ్ గోపాల్ వర్మకు, వంగవీటి రాధాకృష్ణకు మధ్య వివాదం ముదురుతోంది. వర్మపై హైదరాబాదులో రంగా అభిమానులు పోలీసులకు పిర్యాదు చేశారు.

హైదరాబాద్: వంగవీటి సినిమాపై వివాదం ముదురుతోంది. రంగా అభిమానులు వర్మపై భగ్గుమంటున్నారు. వంగవీటి సినిమాలో కాపుల మనోభావాలు దెబ్బతీసేలా రౌడీలుగా చూపించారంటూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌లపై కాపులు, రంగా అభిమానులు హైదరాబాదులోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వంగవీటి సినిమా మొత్తం వాస్తవాలకు విరుద్ధంగా నిర్మించారని, కాపుల మనోభావాలు దెబ్బసేలా 'వంగవీటి' టైటిల్ పెట్టి 'కాపు కాసే శక్తి' లాంటి పదాలను వాడుతూ రంగాగారితో పాటు కాపుల మనోభావాలు దెబ్బతీసిన దర్శకుడు వర్మ, నిర్మాతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో వారు కోరారు.

Radha, Ranga mitra mandali fires at Ram gopal Varma

'కాపుకాసేశక్తి' అనే ట్యాగ్‌లైన్ ద్వంద్వార్థం వచ్చేలా ఉందని అభిప్రాయపడ్డారు. రౌడీలు అయ్యప్పలుగా వచ్చి చంపితే.. అయ్యప్పలే వచ్చి చంపినట్లు సినిమాలో ఉందని, ఆ సన్నివేశం తమ మనో భావాలు దెబ్బతీసిందని అయ్యప్ప మాలధారలో ఉన్న ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

కాగా, విజయవాడలో రాధ, రంగా మిత్రమండలి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వంగవీటి సినిమా ప్రదర్సిస్తున్న థియేటర్ వద్ద ఆందోళనకు దిగారు. వర్మ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వర్మపై చర్యలు తీసుకోవాలని పాయకరావు పేట పోలీసులు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

English summary
Radha, Ranga Mitra mandali compalained to the police against Ram Goapal Varma on Vangaveeti film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu