»   » బాలకృష్ణ కి హీరోయిన్ దొరికింది

బాలకృష్ణ కి హీరోయిన్ దొరికింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ చిత్రానికి హీరోయిన్ హంటింగ్ ముగిసింది. ఈ చిత్రంలో రాధికా ఆప్టే ని హీరోయిన్ గా ఎంపికచేసినట్లు సమాచారం. ఇప్పటికే ఒక హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ ఎంపిక కాగా, కొన్ని రోజులుగా మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.అయితే మొత్తానికి హీరోయిన్ ని సెట్ చేసారు. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన మరో హీరోయిన్ గా రాధిక ఆప్టే కనిపించనుంది. అనీల్ సుంకర ఈ విషయం ఖరారు చేసారు.

రక్తచరిత్ర చిత్రంలో పరిటాల రవి సతీమణి పరిటాల సునీత పాత్రలో రాధిక ఆప్టే అద్భుతంగా, సహజ సిద్ధంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రకాష్ దర్శకత్వంలో వచ్చిన 'దోని' చిత్రంలో కూడా రాధిక తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె పలు తమిళ చిత్రాల్లో పాటు, ఓ మరాఠీ చిత్రంలో నటిస్తోంది. 'కరికలన్' మరియు 'వెట్రి సెల్వన్' అనే రెండు తమిళ చిత్రాలు త్వరలో విడుదలకానున్నాయి.


రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర' చిత్రంలో చేసిన రాథిక ఆప్టే గుర్తుండే ఉంటుంది. ఆమెకు ఆ తర్వాత పెద్ద ఆఫర్స్ వస్తాయని అంతా భావించారు కానీ...ఆమె కెరీర్ అనుకున్నంత వేగం పుంజుకోలేదు. అయితే ఆమె తాజాగా తెలుగు,తమిళ భాషల్లో మార్కెట్ ఉన్న కార్తీ ప్రక్కన బుక్ అయ్యింది. దాంతో మళ్లీ తన కెరీర్ రీ స్టార్ట్ అయినట్లు భావిస్తోంది. 'బిరియాని' తయారీలో తీరికలేకుండా ఉన్న కార్తి ప్రస్తుతం రాజేష్‌ దర్శకత్వంలోని 'అల్‌ ఇన్‌ ఆల్‌ అళగురాజా'లో కూడా నటిస్తున్నాడు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్.

మరో హీరోయిన్ కోసం గతంలో అన్వేషణ సాగించారు. తదనంతరం భావనను రెండో హీరోయిన్ గా తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ స్థానాన్ని నటి రాధిక ఆప్టే సొంతం చేసుకుంది. ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ.. ప్రారంభంలో భావనతో మాట్లాడాం. ఆమె బిజీగా ఉండటంతో కాల్షీట్లు కుదరలేదు. అందుకే రాధిక ఆప్టేను ఎంపిక చేసుకున్నామని చెప్పారు . కార్తీ, రాజేష్‌ కలయికలో వస్తున్న సినిమా 'ఆల్‌ఇన్‌ఆల్‌ అళగురాజా' . ఈ చిత్రం రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


రాధిక ఆప్టే గతంలో వర్మ తీసిన 'రక్త చరిత్ర', ప్రకాష్ రాజ్ చేసిన 'ధోని' సినిమాల్లో కనిపించింది. ఆమె చాలా టాలెంట్ ఉన్న నటి. 'లెజెండ్' మూవీ లో కూడా రాధికా ఆప్టే ఒక చాలెంజింగ్ పాత్రలో కనిపించనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని 2014 మొదట్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. వారాహి చలన చిత్ర బ్యానర్ తో కలిసి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నారు.

English summary
Radhika Apte has been finalized as the heroine of Balakrishna and Boyapati Sreenu's film. Producer Anil Sunkara confirmed this news. He said that Radhika Apte will be the heroine of this film. Earlier Radhika has displayed her acting prowess in Raktha Charithra and Dhoni. The role in this film will be a challenging one for Radhika.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu