»   » హిమాలయాలకు వెలుతున్న బాలయ్య హీరోయిన్

హిమాలయాలకు వెలుతున్న బాలయ్య హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య హీరోగా తెరకెక్కిన లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించి అటు పెర్ఫార్మెన్స్ పరంగా, ఇటు గ్లామర్ పరంగా మంచి మార్కులే కొట్టేసింది బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే. ఈ మధ్య కాలంలో రాధిక ఆప్టే పలు హాట్ కామెంట్లతో, బోల్డ్ కామెంట్లతో వార్తల్లో వ్యక్తిగా మారింది. ఆమెకు సంబంధించిన ఓ న్యూడ్ వీడియో కూడా ఇంటర్నెట్లో హల్ చల్ చేసింది.

ఆ సంగతులు పక్కన పెడితే....ఇటీవలే తన సినిమా షూటింగులు ముగిసి కాస్త గ్యాప్ దొరకడంతో అమ్మడు హిమాలయాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటోంది. త్వరలో తను నటించబోయే బ్రిటిష్ ఫిల్మ్ ‘బాంబేరియా' చిత్రం షూటింగుకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ గ్యాపులో హిమాలయాలకు ట్రెక్కింగ్ కు వెళ్లే ఆలోచనకు వచ్చింది.

Radhika Apte going to Himalayas

రాధిక ఆప్టేకు చిన్నతనం నుండి వివిధ ప్రాంతాల్లో ట్రావెల్ చేయడం అంటే ఎంతో ఇష్టం. ప్రతి సంవత్సరం ఏదైనా కొత్త ప్రాంతానికి వెలుతుంటుంది. అందులో భాగంగానే రాధిక ఆప్టే ప్రస్తుతం హిమాలయాల యాత్రకు సిద్ధమైంది.

ఆమె నటించబోయే ‘బాంబేరియా' సినిమా విషయానికొస్తే ఈ చిత్రాన్ని బ్రిటిష్ ప్రొడ్యూసర్ మైఖేల్ వార్డ్ నిర్మించబోతున్నారు. అక్షయ్ ఒబెరాయ్, సిద్ధాంత్ కపూర్, శిల్పా శుక్లా, రవి కిషన్ తదితరులు నటిస్తున్నారు.

English summary
Radhika Apte took break from her upcoming British film "Bombairiya" to visit the Himalayas for trekking. The 29-year-old actress loves exploring places and has been an ardent traveller since childhood.
Please Wait while comments are loading...