»   » బాలయ్య ఎఫెక్టే: రజనీకాంత్ సినిమాలో ఆమెకు ఛాన్స్!

బాలయ్య ఎఫెక్టే: రజనీకాంత్ సినిమాలో ఆమెకు ఛాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య హీరోగా తెరకెక్కిన లెజెండ్, లయన్ చిత్రాల్లో నిటించిన రాధిక ఆప్టే తనదైన పెర్పార్మెన్స్‌తో ఆకట్టుకుంది. బాలయ్య సినిమాల్లో నటించడం వల్ల ఆమెకు దక్షిణాదిన మంచి గుర్తింపు లభించింది. ఆ ఎఫెక్టుతోనే కాబోలు అమ్ముడు ఇపుడు ఏకంగా రజనీకాంత్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.

రజనీకాంత్ హీరోగా పా. రంజిత్ తెరకెక్కబోయే సినిమాలో రాధిక ఆప్టేను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆమెను ఫైనలైజ్ చేసారని, త్వరలోనే అఫీషియల్ సమాచారం వెలువడుతుందని అంటున్నారు. కలైపులి ఎస్‌ ధాను నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

Radhika Apte Is Rajinikanth's Heroine In Pa Ranjith's Project

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మలేషియాలో ప్రారంభమనుంది. 60 రోజులు మలేషియాలో షూటింగ్‌ తర్వాత థాయ్‌ల్యాండ్‌, హాంగ్‌కాంగ్‌తోపాటు చెన్నైలో షూటింగ్‌ చేయనున్నారు. ఇప్పటివరకూ కేవలం రెండు చిత్రాలకే దర్శకత్వం వహించాడు.. అయితేనేం.. తన కథతో బడా ప్రొడ్యూసర్ ను ఒప్పించాడు... కోలీవుడ్ సూపర్ స్టార్ ను మెప్పించాడు. దీంతో రజనీకాంత్ నెక్స్ట్ మూవీకి దర్శకుడయ్యాడు రంజిత్.

రజనీకాంత్ తదుపరి చిత్రం విషయమై.. కొన్నాళ్లుగా శంకర్, కె.ఎస్.రవికుమార్ వంటి కోలీవుడ్ర్ డైరెక్టర్స్ క్యూలో ఉండగా.. వీరందరినీ కాదని... 'అట్టకత్తి', 'మద్రాస్' వంటి చిన్న చిత్రాలతో మెప్పించిన రంజిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్. తమిళ స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన అగ్రనిర్మాత కలైపులి థాను.. ఈ సినిమా నిర్మించనున్నారు. గతంలో థాను నిర్మించిన 'యార్' చిత్రంలో అతిథిపాత్ర పోషించిన రజనీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఈ సంస్థలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు నిర్మాత థాను తెలియజేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట.

English summary
Radhika Apte Is Rajinikanth's Heroine In Pa Ranjith's Project.
Please Wait while comments are loading...