»   » మళ్లీ పెళ్లంటూ రూమర్స్, మండిపడ్డ నటి రాధిక, కేసులు పెడతానంటూ...

మళ్లీ పెళ్లంటూ రూమర్స్, మండిపడ్డ నటి రాధిక, కేసులు పెడతానంటూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: కన్నడ సినీ నటి రాధిక అప్పటికే పెళ్లయిన ను జెడి (ఎస్) నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి (జాగ్వార్ హీరో తండ్రి) ని రెండో వివాహం చేసుకున్నారు. దేవెగౌడ కుమారుడైన కుమారస్వామి గతంలో సినిమా రంగంలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పని చేసారు.

ఆ సమయంలో రాధికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. ఆ తర్వాత కుమార స్వామి రాజకీయాల వైపు అడుగులు వేసి ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు.

అయితే ఇప్పుడు రాధిక మరో వివాహం చేసుకోబోతోందంటూ మీడియాలో వార్తలు ఒక్క సారిగా గుప్పుమన్నాయి. ఈ విషయమై రాధిక మీడియాతో మాట్లాడారు. అవన్నీ అర్దం లేని ఆరోపణలే అని కొట్టిపారేసారు. అంతేకాదు ఇలాంటి రూమర్స్ ని క్రియేట్ చేసిన వారిపై కేసులు పెడతానని వార్నింగ్ సైతం ఇచ్చారు.

రెండో పెళ్లి చేసుకోబోతోందంటు

రెండో పెళ్లి చేసుకోబోతోందంటు

రీసెంట్ గా ఆమె మంగుళూరుకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకోబోతోందని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలకు విపరీతమైన ప్రాముఖ్యత వచ్చింది. ఈ నేపధ్యంలో రాధిక మీడియా ముందుకు రావాల్సి వచ్చింది.

ఎవరో చేసారో కానీ ఫొటోలు కూడా

ఎవరో చేసారో కానీ ఫొటోలు కూడా

మంగళూరు బిజినెస్ మ్యాన్ వివేక్ రాయ్ తో ఆమె దిగిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారంలోకి తీసుకువచ్చారు కొందరు. ఆమె అతనితొ గత కొంతకాలంగా ప్రేమలో ఉందని, అతన్నే పెళ్లి చేసుకోబోతోందని వారు రాసుకొచ్చారు.

రాధిక వెర్షన్ ఇదీ

రాధిక వెర్షన్ ఇదీ

ఈ రూమర్స్ పై రాధిక కాస్త ఘాటుగానే స్పందించింది. నేను అగ్రికల్చర్ కు చెందిన ఓ బిజినెస్ లోకి వెల్దామనుకుంటున్నారు. దాంతో ఆయన్ని కలిసాను. మాది ప్యూర్ గా బిజినెస్ రిలేషన్. మేము ఫ్యాక్ట్ ఫైడింగ్ ట్రిప్ కు వెళ్లినప్పుడు తీసిన ఫొటోలు అవి అన్నారు.

సెలక్టివ్ తీసిన ఫొటోలను

సెలక్టివ్ తీసిన ఫొటోలను

కొందరు కావాలని కొన్ని ఫొటోలను మార్పింగ్ చేసి వదిలారు. నేను కొందరు అబిమానులతో దిగిన ఫొటోలను తీసుకొని ఫొటో షాఫ్ ద్వారా మార్పింగ్ చేసారు. ఇదంతా ఇంటెక్షన్ గా చేసిన పని. నాకు వివేక్ మధ్య ఉన్న మంచి రిలేషన్ ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారామె.

ఇవి విని ఆయన హర్ట్

ఇవి విని ఆయన హర్ట్

వివేక్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన ఈ రూమర్స్ విని చాలా హర్ట్ అయ్యారు. ఈ విషయమై బాధ పడ్డారు. తాను మంగుళూరు వెళ్లానని ప్రచారం చేస్తున్నారని, కానీ తాను ఇంకా బెంగుళూరు లోనే ఉన్న విషయం గమనించాలని ఆమె కోరారు.

వాళ్లను వదలను

వాళ్లను వదలను

తనపై ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసే వారిని పొరపాటున వదిలే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేసారు. తన పరువు పోగెట్టే ప్రయత్నం ఇదని, అలాగే తన కుటుంబం సంభంధాలను ఇలాంటి రూమర్స్ , ఫొటలతో పాడు చేయాలని కొందరు ఆమె ప్రయత్నిస్తున్నారని చెప్పింది. వారికి తను సరైన సమాధానం చెప్తానని వివరించింది.

జాగ్వార్ హీరో తండ్రితో

జాగ్వార్ హీరో తండ్రితో

జాగ్వారా హీరో తండ్రితో తన రిలేషన్ గురించి మాట్లాడటానికి ఆమె ఆసక్తి చూపలేదు. కుమార స్వామితో ఆమె 2006లో సీక్రెట్ గా వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. సమైక అనే పేరు పెట్టారామె.

మూడు సినిమాలు ఒకే సారి

మూడు సినిమాలు ఒకే సారి

భర్త సహకారంతో రాధిక కుమార స్వామి నిర్మాతగా మారబోతున్నారు. త్వరలో కన్నడలో అక్కడి స్టార్ హీరోలతో మూడు భారీ ప్రాజెక్టులు చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ సినిమాలో ఓ దానికి ప్రభుదేవా దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

ఖచ్చితంగా వస్తా

ఖచ్చితంగా వస్తా

తన కమ్ బ్యాక్ సినిమా కన్నడ పరిశ్రమలో ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. తాను సిని పరిశ్రమకు గుడ్ బై చెప్పలేదని ఆమె అన్నారు. అయితే తాను మంచి స్క్రిప్టు తోనే వస్తాను అన్నారు. ఖచ్చితంగా తనకు సరిపడే స్క్రిప్టు దొరికిన రోజున తనను ఎవరూ ఆపలేరని ఆమె అన్నారు.

మీడియా ముందుకు వచ్చి దేవగౌడ

మీడియా ముందుకు వచ్చి దేవగౌడ

తన కుమారుడు నిఖిల్ గౌడను జాగ్వార్ తో కన్నడ, తెలుగు సినీ రంగానికి పరిచయం చేసిన కుమార స్వామి, ఇప్పడు సొంత పార్టిలో శాసన సభ్యులే నిరసన వ్యక్తం చేయటం జరిగింది. రేస్ కోర్స్ రోడ్డులో కొన్ని సంవత్సరాల పాటు జేడీఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉంది. జేడీఎస్ నాయకులు శేషాధ్రిపురంలో కొత్త కార్యాలయం నిర్మిస్తున్నారు. ఈ కార్యాలయం నిర్మాణానికి తన దగ్గర, తమ కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు లేవని, పార్టీ శాసన సభ్యులు, మాజీ మంత్రులు, కార్యకర్తలు నిధులు సమకూర్చాలని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పారు.

అందుకే కోపం వచ్చింది

అందుకే కోపం వచ్చింది

కోట్లు ఖర్చు పెట్టి నిఖిల్ గౌడను సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం చెయ్యడానికి దేవేగౌడ కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. దీంతో, కొడుకును హీరోగా పెట్టి సినిమా తీసేందుకు డబ్పులున్నాయి కానీ, కార్యాలయం కోసం డబ్బులు లేవా అని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

జోలపట్టాం

జోలపట్టాం

సినిమాకు ఖర్చు చేసే రూ.60 కోట్లలో కొంత మొత్తాన్ని పార్టీ కార్యాలయం నిర్మాణానికి ఇస్తే తాము సంతోషంగా జోలపట్టి నిధులు వసూలు చేస్తామని ఎమ్మెల్యేలు అంటున్నారు. దేవేగౌడ ప్రధాని అయ్యారని, ఆయన కుమారుడు సీఎం అయ్యారని, పార్టీలో వారి కుటుంబ సభ్యులు అనేక పదవులు అనుభవించారని గుర్తు చేస్తున్నారు. పార్టీకి శాశ్వత భవనం నిర్మించేందుకు డబ్బులు లేవనడం ఎంత వరకు సమంజసమని అడుగుతున్నారు.

English summary
Radhika Kumaraswamy has come out to clarify the rumours, which claimed that she had tied the knot for the second time with a Mangaluru-based businessman. The actress has denied the reports and said that she will take legal action against those behind the rumours.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu