»   »  సిగ్గుతో తలదించుకోండి: విశాల్ వర్గంపై రాధిక రెచ్చిపోయి ట్వీట్స్

సిగ్గుతో తలదించుకోండి: విశాల్ వర్గంపై రాధిక రెచ్చిపోయి ట్వీట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: నడిగర్ సంఘం ఎన్నికలు ముగిసినప్పటికీ తమిళ సినీ తారల మధ్య వివాదం సద్దుమణగలేదు. ఎన్నికల సందర్భంగా నువ్వానేనా అంటూ పోటీ పడుతూ మీడియా ముందుకొచ్చి విమర్శలు గుప్పించుకున్న తారలు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా చల్లబడడం లేదు.

విశాల్ పక్షం శరత్‌కుమార్‌పై చేసిన ఆరోపణలు నిరాధారమని తేలినట్లు సమాచారం. దీంతో ఆయన సతీమణి, సినీ నటి రాధిక ఆగ్రహంతో ఊగిపోతూ ట్విట్టర్‌లో విశాల్ వర్గంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 30 ఏళ్లుగా దక్షిణాది సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసిన శరత్ కుమార్, నడిగర్ సంఘ భవన నిర్మాణ ఒప్పందాన్ని గతంలోనే రద్దు చేసుకున్నామని, అయినా లేనిపోని ఆరోపణలు చేశారని శరత్ బాధపడ్డారు.

Radhika tweets against Vishal panel: hang your heads

ఈ నేపథ్యంలో భవన నిర్మాణంలో వాస్తవాలు తెలుసుకోకుండా విశాల్ చేసిన ఆరోపణలపై రాధికా ట్విట్టర్లో ఘాటుగా స్పందించింది. ఈ ఎన్నికలకు ప్రధాన కారణమైన నడిగర్ సంఘం భవన నిర్మాణంపై ఎస్‌బీఐ సినిమాస్టర్ తప్పుడు ఒప్పందం కుదుర్చుకుందని తేలింది.

ఈ ఒప్పందం చుట్టే విశాల్ ఆరోపణలు తిరిగాయి. ఎస్‌బీఐ సినిమాస్టన్‌తో ఒప్పందాన్ని సెప్టెంబర్ 29వ తేదీనే రద్దు చేసుకున్నట్లు తేలడంతో రాధిక ట్విట్టర్లో విశాల్ వర్గంపై దుమ్మెత్తిపోసారు.

''శరత్ కుమార్‌పై విమర్శలు గుప్పించిన ఫ్రెండ్సంతా సిగ్గుతో తలదించుకోవాలని, శరత్‌ను తలచుకుంటే గర్వంగా ఉందని'' ట్వీట్ చేసింది. Hang ur heads in shame for the false accusations friends. proud of you sarath empty victory అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

English summary
"Hang ur heads in shame for the false accusations friends. proud of you sarath empty victory" Radhika tweeted targeting Vishal panel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu