twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రాన్స్ జెండర్స్ నేరుగా నా ఇంటికి వచ్చారు.. అందుకే కాంచన తీశాను: రాఘవ లారెన్స్

    |

    ఇండియన్ బెస్ట్ మల్టిటాలెంటెడ్ టెక్నీషియన్స్ లలో ఒకరైన రాఘవ లారెన్స్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. ఒక డ్యాన్స్ మాస్టర్ గానే కాకుండా దర్శకుడిగా హీరోగా అలాగే సంగీత దర్శకుడిగా కూడా లారెన్స్ ఎంతగానో క్రేజ్ అందుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ దర్శకుడు ఒక మంచి మానవత్వ విలువలున్న మనిషిగా ఎంతగానో గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక మొదటిసారి బాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ష్మీ బాంబ్ ద్వారా అడుగుపెట్టిన లారెన్స్ ఆ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

    లక్ష్మీ బాంబ్ లో మార్పులు చేసి..

    లక్ష్మీ బాంబ్ లో మార్పులు చేసి..

    లక్ష్మీ బాంబ్ సినిమా నవంబర్ 9న హాట్ స్టార్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఓటీటీ డీల్ ని ఒప్పుకున్న చిత్ర యూనిట్ తప్పకుండా సినిమా ఆడియెన్స్ కి నచ్చుతుందని ప్రమోషన్స్ డోస్ కూడా పెంచింది. 2015లో వచ్చిన కాంచన సినిమాకు రీమేక్ గా వచ్చిన లక్ష్మీ బాంబ్ లో కొన్ని మార్పులు చేసినట్లు లారెన్స్ చెప్పాడు.

    అందుకే లక్ష్మీ బాంబ్ టైటిల్ సెట్ చేశాము

    అందుకే లక్ష్మీ బాంబ్ టైటిల్ సెట్ చేశాము

    కాంచన అనే పేరుకు మరో అర్థం లక్ష్మీ.. అందుకే ఈ సినిమాకు లక్ష్మీ బాంబ్ అనే పేరు పెట్టాము. హిందీ ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగా సినిమాను రూపొందించినట్లు తెలిపిన లారెన్స్ తన దగ్గరకు ఎంతో మంది ట్రాన్స్ జెండర్స్ వచ్చేవారని చెబుతూ వారి బాధలను విన్నాక ఎలాగైనా వారి జీవిత ఆధారంగా ఒక సినిమా చేయాలని అనుకున్నాను. లక్ష్మీ బాంబ్ లో ఇంకా మంచి విషయాలను చూపించడం జరిగింది.

    వారి గురించి చెప్పాలని అనుకున్నా

    వారి గురించి చెప్పాలని అనుకున్నా

    హారర్ కామెడీతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాకుండా లక్ష్మీ బాంబ్ సినిమా చూసిన తరువాత అందరిలో ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. నా దగ్గరకు సహాయం కోసం వచ్చిన వారిలో ట్రాన్స్ జెండర్స్ వారి బాధలను నాతో చెప్పుకున్నప్పుడు హృదయాన్ని కదిలించింది. వారి విలువ గురించి ప్రపంచానికి చెప్పాలని అనుకున్నా. అందుకే కాంచన సినిమా చేశాను.

    Recommended Video

    Raghava Lawrence Says That His Children Recovered From Covid 19
    చాలా మంది ట్రాన్స్ జెండర్స్ ఇంటికి వచ్చారు

    చాలా మంది ట్రాన్స్ జెండర్స్ ఇంటికి వచ్చారు

    కాంచన సినిమా చూసిన తరువాత చాలా మంది ట్రాన్స్ జెండర్ నా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించారు. ఇక ఇప్పుడు అదే కాన్సెప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులతో హిందీలో లక్ష్మీ బాంబ్ గా తెరకెక్కించడం జరిగింది. నిజంగా ఇలాంటి సినిమా చేయడానికి ఒప్పుకున్న అక్షయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఈ సినిమాలో ఆయన నటన చాలా అద్భుతంగా ఉంటుంది. లక్ష్మీగా కూడా చాలా పవర్ఫుల్ గా కనిపించారు.. అని లారెన్స్ వివరణ ఇచ్చారు.

    English summary
    Raghava Lawrence, one of the best multitalented technicians in India, is no stranger to the unknown. Lawrence received a lot of craze not only as a dance master but also as a director as a hero as well as a music director. Above all, the director is widely regarded as a man of good human values. Lawrence, who made his Bollywood debut with Laxmmi Bomb, revealed some interesting facts about the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X