twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కడుపు నిండాలన్నా, స్క్రీన్ మీద కొట్టాలన్నా ప్రభాసే... ఆలస్యానికి కారణాలనేకం: లారెన్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కడుపు నిండా పెట్టాలన్నా... స్క్రీన్ మీద కొట్టాలన్నా ప్రభాసే అని, ఆ రేంజిలో ప్రభాస్ యాక్షన్ సీన్స్ పండించాడని దర్శకుడు రాఘవ లారెన్స్ చెప్పారు. ప్రభాస్, లారెన్స్ కాంబినేషన్లో రూపొందిన 'రెబల్' ఆడియో వేడుక గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసారు.

    ప్రభాస్ ఫ్రెండ్ షిప్ కి మర్యాదనిస్తాడు. వచ్చిన పేరును నిలబెట్టుకోవడానికి చాలా కష్ట పడతాడు, ఈ సినిమాకు రెబల్ అనే టైటిల్‌ని ప్రభాసే సూచించాడని తెలిపారు. రెబల్ సినిమా ఆలస్యం కావడానికి గల కారణాలు వెల్లడిస్తూ.... ప్రభాస్‌కి కథ చెప్పాను,విన్న తర్వాత కొంచెం మాస్‌గా ఉంటే బాగుంటుందని అన్నారు.

    ప్రభాస్ కోరిక మేరకు కథలో మార్పులు చేసాను. రెబల్ సినిమాను డీల్ చేసేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చేసాను. హీరోయిన్స్ డేట్స్ ప్రాబ్లం రావడం కూడా మరో కారణం. మొదట ఈచిత్రంలో కీలక పాత్రకు శరత్ కుమార్‌ని అనుకున్నాం, కానీ పెద్దనాన్నే కరెక్ట్ అని ప్రభాస్ చెప్పడంతో కృష్ణంరాజు గారికి తగిన విధంగా మార్పులు చేయడానికి కూడా కొంత సమయం పట్టిందని లారెన్స్ అన్నారు.

    ఈ సినిమా ఖచ్చితంగా ప్రభాస్ అభిమానులకు పూర్తి సంతృప్తిని ఇస్తుంది. ఒకరకంగా ఈచిత్రం ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగిరేసేలా ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం వ్యక్తం చేసారు. ఈ చిత్రం ద్వారా ప్రభాస్‌కు మాస్‌లో మరింత ఫాలోయింగ్ పెరుగుతుందని లారెన్స్ అన్నారు.

    English summary
    "So many reasons are behind 'Rebel' delay" Raghava Lawrence told. Krishnam Raju released the Rebel audio and presented the first copy to Rajamouli. Rebel is released through Aditya Music Company and Suma hosted the event while Russian dancers and actress Rachana Mourya and other singers performed on stage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X