For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లారెన్స్ హిట్ సినిమాని 3D లోకి కర్వర్షన్

  By Srikanya
  |

  హైదరాబాద్: క్రితం సంవత్సరం రాఘవ లారెన్స్ డైరక్ట్ చేసిన హిట్ సినిమా కాంచన. ఈ చిత్రం ఇప్పుడు 3D లోకి కన్వర్షన్ చేస్తున్నారు. బెల్లంకొండ సురేష్ ఈ విషయం మీడియాకు తెలియచేసారు. త్రిడీలోకి కన్వర్ట్ చేసి రీరిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... మేము ఇప్పటికే ఈ కన్వర్షన్ ప్రాసెస్ ని ప్రారంభించాం. ఇక ఈ 3D వెర్షన్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా లారెన్స్ పై ఓ పాటను చిత్రీకరించి కలుపుతున్నాం..ఈ సినిమా గ్యారెంటీగా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో రాఘవలాన్స్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం 'కాంచన'.

  ఇక లారెన్స్ తాజా చిత్రం 'రెబల్'. ప్రభాస్ కాంబినేషన్ లో ఈ చిత్రం బిజినెస్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా తమిళ మార్కెట్లో ఇప్పటివరకూ ఏ ప్రబాస్ చిత్రానికి జరగనంత బిజినెస్ ఈ చిత్రానికి జరగటం విశేషంగా చెప్పుకుంటున్నారు. ప్రభాస్ గత చిత్రం కేవలం 11 లక్షలు మాత్రమే తమిళనాడులో అమ్ముడైంది. ఇప్పుడు ఈ చిత్రం 33 లక్షలు కు ఓ పెద్ద నిర్మాణ సంస్ధ తీసుకున్నట్లు సమాచారం. అంటే రెండు రెట్లు బిజినెస్ పెరిగింది. లారెన్స్ , తమన్నాలకి తమిళనాట మార్కెట్ ఉండటం అక్కడ బిజినెస్ కి ప్లస్ అయ్యిందని తెలుస్తోంది.

  ఈ రెబెల్ చిత్రంలో కృష్ణరాజు ఓ కీలకమైన రోల్ చేస్తున్నారు. కథని మలుపుతిప్పే ఈ పాత్ర కోసమే సినిమా నడుస్తుందని చెప్తున్నారు. లారెన్స్ మాట్లాడుతూ...మా సినిమా లో హీరో కూర్చుని కబుర్లు చెప్పే రకం కాదు. రంగంలోకి దిగి చేసి చూపిస్తాడు. ఏటికి ఎదురీదడం అతనికిష్టం. పోరాడైనా గెలవడం అతని నైజం. ఇంతకీ అతని లక్ష్యం ఏంటి? అనేది మా చిత్రంలో చూడాల్సిందే అన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల అవుతోంది.

  అలాగే ప్రభాస్‌ శైలికి సరిపోయే చిత్రమిది.'రెబల్' అనేది టైటిల్ మాత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది.ప్రభాస్ కెరీర్‌లో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా 'ఛత్రపతి'. ఆ సినిమాను మించే స్థాయిలో మా 'రెబల్' ఉంటుంది మాస్‌ని అలరించేలా ఫైట్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అందరికీ నచ్చుతుంది. ప్రభాస్ కెరీర్‌లోనే 'రెబల్' హై బడ్జెట్ ఫిలిం అవుతుంది. అన్నారు.

  ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

  English summary
  Raghava Lawrence's Kanchana was one of the biggest hits last year. With 3D has become new craze, producer Bellamkonda Suresh has decided to re-release the movie and convert it into 3D format. "We have already begun the conversion process. The special attraction of the 3D version is a new song filmed on Lawrence," said producer Bellamkonda Suresh in a press statement.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X