»   »  లారెన్స్‌ 'పటాస్ ' రీమేక్ ప్రారంభం(ఫొటోలు)

లారెన్స్‌ 'పటాస్ ' రీమేక్ ప్రారంభం(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రాఘవా లారెన్స్‌ కీలక పాత్రలో నటిస్తున్న 'మొత్త శివ కెత్త శివ' అనే కొత్త చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ విషయాన్ని లారెన్స్‌ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలుపుతూ... కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

Hi... friends and fans today I have started my new film #MottaSivaKettaSiva.. First time working with Sathyaraj sir Feeling very happy.. Good night friends....

Posted by Raghava Lawrence on 18 November 2015

ఈ చిత్రం కోసం మొదటిసారిగా నటుడు సత్యరాజ్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందంటూ పేర్కొన్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను లారెన్స్‌ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Raghava Lawrence's Motta Shiva Ketta Shiva started

రీసెంట్‌గా రిలీజైన 'గంగ' సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన లారెన్స్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేసే పనిలో పడ్డాడు. అందులో భాగంగానే తెలుగులో విజయం సాధించిన 'పటాస్' తమిళ రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో ఆర్.బి. చౌదరి నిర్మించే ఈ సినిమాకు సాయి రమణి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ రోజు నుండి తమిళ రీమేక్ సెట్స్ పైకి వెళ్ళబోతోంది. 'మొట్ట శివ కెట్ట శివ' పేరుతో నిర్మితమౌతున్న ఈ సినిమాలో 'పటాస్'లో సాయికుమార్ పోషించిన పాత్రను సత్యరాజ్ తమిళంలో చేయబోతున్నాడు.

English summary
Raghava Lawrence’s next film as a hero, for Vendhar Movies has been titled as Motta Siva Ketta Siva. Few reports also suggested that this Kanchana hero will be teaming up with director Sai Ramani to remake the Telugu film Pataas.
Please Wait while comments are loading...