కీరిటం పెడితే కృష్ణుడు.. క్యాప్‌పెడితే కౌబాయ్: రాఘవేంద్రరావు కామెంట్స్
యంగ్ హీరో నాగశౌర్యను ఉద్దేశిస్తూ సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు కొన్ని కామెంట్స్ చేశారు. నాగశౌర్య హీరోగా రూపొందిన 'అశ్వద్ధామ' సినిమా రిలీజ్ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆసక్తికరంగా మాట్లాడారు. నాగశౌర్య ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు అంటూ ఆయన్ను ఆకాశానికెత్తారు దర్శకేంద్రుడు.
శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై నాగశౌర్య హీరోగా రూపొందిన చిత్రం 'అశ్వద్ధామ'. రమణ తేజ దర్శకత్వంలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో మెహరీన్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా నిన్న (గురువారం) ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాఘవేంద్రరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాఘవేంద్రరావు.. ''నేను చిన్న సినిమాలు చూస్తూ వస్తున్నా. కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న దర్శకులు, సాంకేతిక నిపుణులు మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. నటుడిగా నాగశౌర్య ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు. గడ్డం ఉంటే ఫైటర్‌గా, గడ్డం తీస్తే క్లాస్‌గా కనిపిస్తాడు. లాగే కీరిటం పెడితే కృష్ణుడిలా, క్యాప్‌పెడితే కౌబాయ్‌లా ఉంటాడు. 'ఊహలు గుసగుసలాడే', 'ఛలో' వంటి సినిమాలు సక్సెస్ సాధించడంతో నాగశౌర్యపై నా కన్ను పడింది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు ఉన్న 'అశ్వథ్థామ' చిత్రం హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అన్నారు.
ఈ రోజే (జనవరి 31న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'అశ్వద్ధామ' సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. చిత్రంలో నాగశౌర్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా నాగశౌర్య బెస్ట్ కెరీర్‌కి బాగా దోహదం చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











