»   »  నా సినిమా ఆమెతోనే: ఊహించని హీరోయిన్ తో రాఘవేంద్రుడి ప్లెజెంట్ షాక్

నా సినిమా ఆమెతోనే: ఊహించని హీరోయిన్ తో రాఘవేంద్రుడి ప్లెజెంట్ షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓం నమో వేంకటేశాయ సినిమా టైం లోనే ఇదే రాఘవేంద్ర రావు గారి చివరి సినిమా అవ్వొచ్చు అన్న సంకేతాలిచ్చాడు అక్కినేని నాగార్జున. నిజానికి ఆ సినిమా అనుకున్నంత హిట్ అయితే దర్శకేంద్రుడు అలాంతి నిర్ణయం మీదే నిలబడేవాడేమో గానీ. నమో వేంకటేశాయ పెద్ద డిజాస్టర్ అవ్వటం తో అలా ఫ్లాప్ తో కెరీర్ కు బాయ్ చెప్పటం నచ్చలేదేమో ఈ దర్శక దిగ్గజానికి అందుకే మళ్ళీ తాను ఇంకో సినిమా తీయనున్నట్టు చెప్పే ప్రయత్నం చేసాడు.

తాజాగా శ్రీదేవి ముఖ్య పాత్రలో వచ్చిన సినిమా 'మామ్'కు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న రాఘవేంద్రరావు.. మళ్లీ దర్శకత్వం చేయాలన్న కోరిక వెల్లడించాడు. ఈసారి తన సినిమా శ్రీదేవితోనే ఉండబోవచ్చంటూ కూడా ముందే హింట్ ఇచ్చేసాడు.ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ శ్రీదేవితో తాను 24 సినిమాలు చేశానని.. ఆమె ఒప్పుకుంటే సిల్వర్ జూబ్లీ సినిమాను భారీ స్థాయిలో తీయాలని ఉందని అన్నాడు రాఘవేంద్రరావు. ఈ సినిమాను సురేష్ బాబు నిర్మిస్తే బాగుంటుందని.. 'మామ్'కు కథ అందించిన కోన వెంకటే దీనికి స్క్రిప్టు సమకూర్చాలని అన్నాడు రాఘవేంద్రరావు. అంటే ఇప్పుడే ఆ సినిమాకి సంబందించిన వర్క్ ఆయన మనస్సులో మొదలైపోయిందన్నమాట.


Raghavendra Rao wants to direct a movie with Sridevi again

తానైతే శ్రీదేవితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నానని.. ఇక నిర్ణయం ఆమెదే అని దర్శకేంద్రుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా శ్రీదేవిని ప్రశంసల్లో ముంచెత్తాడు రాఘవేంద్రుడు. మామూలుగా ఏ సినిమా అయినా చూడాలనుకున్నపుడు అది ఎలా ఉందో తెలుసుకుంటామని.. కానీ శ్రీదేవి నటిస్తోందంటే ఆమెను చూడ్డానికే జనాలు సినిమాకు వెళ్తారని.. ఆమె ఆల్ ఇండియా స్టార్ అని.. నటన, అందం రెండింట్లోనూ శ్రీదేవికి నూటికి నూరు మార్కులు పడతాయని.. ఆమె సినిమాల్ని అన్ని వర్గాల ప్రేక్షకులూ ఇష్టపడతారని రాఘవేంద్రరావు కితాబిచ్చాడు. అయితే ఈ దర్సకేంద్రుడి ఇంత ఆకాశానికెత్తినా శ్రీదేవి మాత్రం తొందరపడలేదు. తాను ఆయన దర్శకత్వం లో నటించేదీ లేనిదీ మాత్రం ఎటూ తేల్చలేదు.


English summary
Director Raghavendra rao Stated that If Actress Sridevi give her dates, he would direct a movie with beautiful heroine Sridevi again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu