twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రఘు కారుమంచి ఇంట తీవ్ర విషాదం.. అనారోగ్యంతో తండ్రి కన్నుమూత!

    |

    టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ మధ్యకాలంలోనే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమంది నటీనటులు, టెక్నీషియన్స్ అనారోగ్య కారణాలతో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఇటీవల నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కూడా ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆ ఘటన మరువకముందే ఇప్పుడు టాలీవుడ్ నటుడి ఇంటిలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    అదుర్స్ సినిమాతో

    అదుర్స్ సినిమాతో

    టాలీవుడ్ కమెడియన్ రఘు కారుమంచి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాదులోనే పుట్టి పెరిగిన ఆయన ఆది సినిమా ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. అయితే ఆది సినిమా తర్వాత అనేక సినిమాలలో ఆయన నటిస్తూ వచ్చారు కానీ ఆయనకు సరైన బ్రేక్ దొరికింది మాత్రం అదుర్స్ సినిమాతోనే అని చెప్పాలి. ఇక ఆ తర్వాత దాదాపుగా ఎన్టీఆర్ నటించే అన్ని సినిమాలలో కూడా ఆయన కనబడుతూ ఉంటారు.

    తీవ్ర విషాదం

    తీవ్ర విషాదం

    ఆది సినిమాతో తన నటన ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన ఇప్పటిదాకా దాదాపుగా 150 సినిమాల్లో నటించారు. ఎంబీఏ పూర్తి చేసిన రఘు కారుమంచి ఒకపక్క ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటిస్తూ ఉంటారంటే ఆశ్చర్యంగా కలుగుతూ ఉంటుంది. అయితే తాజాగా రఘు కారుమంచి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రఘు కారుమంచి తండ్రి వెంకటరావు కారుమంచి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వెంకట్రావు గురువారం నాడు శ్వాస విడిచారు.

    Recommended Video

    సీతా రాముల ప్రేమ కావ్యం, ఓ అద్భుతం *Reviews | Telugu FilmiBeat
    తీవ్ర సంతాపాన్ని

    తీవ్ర సంతాపాన్ని

    1947 జూన్ 10వ తేదీన తెనాలిలో జన్మించిన వెంకట్రావు ఆర్మీ అధికారిగా సేవలందించారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన తమ సంతానం దగ్గరే ఉంటున్నారు. వెంకట్రావు మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధుమిత్రులు స్నేహితులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక రఘు కారుమంచి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుందన్న విషయం తెలుసుకున్న సినీ పరిశ్రమకు చెందిన వారు ఆయనకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    1500 టీవీ ఎపిసోడ్స్ లో

    1500 టీవీ ఎపిసోడ్స్ లో

    ఇక సినిమాలలోనే కాకుండా రఘు కారుమంచి జబర్దస్త్ ద్వారా కూడా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. రోలర్ రఘు పేరుతో పాపులర్ అయి గతంలో ఒక టీంకు టీం లీడర్ గా కూడా ఉండేవారు. ఇక ఆయన 32 ప్రోగ్రామ్ లకు సంబంధించిన 1500 టీవీ ఎపిసోడ్స్ లో కనిపించి ఒక రికార్డు సృష్టించారు.

    హీరో సినిమాలో

    హీరో సినిమాలో

    మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన ఆడపిల్లలను సంరక్షించాలి అంటూ తీసిన ఒక షార్ట్ ఫిలింకి 2006వ సంవత్సరంలో ప్రసార భారతి నుంచి అలాగే యూనిసెఫ్ నుంచి ఆయనకు అవార్డు కూడా దక్కింది. గత ఏడాది ఆయన నటించిన రెండు సినిమాలు జాంబిరెడ్డి, క్రేజీ అంకుల్స్ విడుదలయ్యాయి. ఇక ఈ ఏడాది గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా నటించిన హీరో సినిమాలో కూడా రఘు కీలక పాత్ర పోషించారు.

    English summary
    There is a tragedy in the house of famous comedian Raghu Karumanchi (Adurs Raghu). His father Venkatrao Karumanchi (74) passed away.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X