»   » క్రిష్ 3: రఘుపతి రాఘవ సాంగ్ టీజర్ (వీడియో)

క్రిష్ 3: రఘుపతి రాఘవ సాంగ్ టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన 'క్రిష్-3' ట్రైలర్ ఇటీవల విడుదలై సినిమాపై భారీగా అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా సినిమాలోని 'రఘుపతి రాఘవ్' సాంగుకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇందులో డాన్స్ స్టెప్పులతో హృతిక్ అదరగొట్టాడు.

టీజర్ చూడటం కోసం ఈ క్రింది పోటోను క్లిక్ చేయండి

Raghupati Raghav Teaser From Krrish 3

తెలుగులో కూడా ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'క్రిష్-3' థియేటర్ రైట్స్ నైజాం ఏరియాలో రూ. 3.75 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఇతర ఏరియాలన్నీ కలిపి రూ. 1.75 కోట్లకు అమ్ముడయినట్లు సమాచారం.

తెలుగులో కూడా హృతిక్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో తెలుగులో విడుదలైన క్రిష్ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అదే విధంగా హృతిక్ నటించిన 'ధూమ్-2' చిత్రం ఏపీలో రూ. 6 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో 'క్రిష్-3' చిత్రం కూడా ఇక్కడ మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

రాకేష్ రోషన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో హృతిక్ రోషన్‌తో పాటు వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో బాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ మూవీస్ కోయి మిల్ గయా, క్రిష్ చిత్రాలకు సీక్వెల్‌గా క్రిష్-3 చిత్రం రూపొందుతోంది. హృతి రోషన్ తండ్రి రాకేష్ రోషన్ స్వీయన నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈచిత్రపై భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందుకోసం ఆయన లుక్ పాత్రకు తగిన విధంగా కనిపించేందుకు ప్రత్యేకంగా కాస్టూమ్స్ డిజైన్ చేసారు. మెటల్‌తో తయారు చేయడంతో దాని బరువు 28 కేజీలకు చేరిందట. సినిమాలో తన పాత్రను ఛాలెంజ్ గా తీసుకున్న వివేక్ ఆ బరువును లెక్కచేయకుండా ఇష్టపడి ఆ పాత్రలో అద్భుతంగా నటించాడట. దీపావళికి ఈచిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
We recently saw the release of the Krrish 3 trailer and now have for you a song's teaser from the much awaited Hrithik Roshan movie. The official trailer has been trending on the internet since its release and it has 
 breaking many records with the number of hits. We look forward to see how this new song titled 'Raghuopati Raghav' will fair.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu