twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుమన్... ‘రగిలింది తెలంగాణ’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సుమన్, సంపత్, పరిణితి ప్రధాన పాత్ర ధారులుగా శివనందిని ఆర్ట్ మూవీస్ పతాకంపై ముప్పిడి సత్యం దర్శకత్వంలో పంజాల వీరస్వామి గౌడ్ నిర్మిస్తున్న చిత్రం 'రగిలింది తెలంగాణ'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ శర వేగంగా యాదగిరి గుట్ట, భువనగిరి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

    ఈ సందర్భంగా దర్శకుడు ముప్పిడి సత్యం చిత్ర విశేషాల్ని వివరిస్తూ...'ఇది తెలంగాణ బతుకు చిత్రం. అనాదిగా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తి చూపుతూ, రాష్ట్రంలో జరుగుతున్న సమకాలీన సమస్యలను ఇతివృత్తంగా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఇందులో సుమన్, సంపత్, పరిణితి తదితరులు పాల్గొంటున్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది' అని తెలిపారు.

    నిర్మాత పంజాల వీరస్వామిగౌడ్ మాట్లాడుతూ 'నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే తొలి షెడ్యూల్ పూర్తవుతుంది' అని చెప్పారు. శివానంద్, సత్యం యాది, పద్మారావు, కిట్టు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బి. యాదగిరి, ఎడిటింగ్: రవీంద్రబాబు, మాటలు: శివానంద్, సంగీతం: ముక్కెర రమేష్, పాటలు: సుద్దాల అశోక్ తేజ, గోరెటి వెంకన్న, విమలక్క, ఎలికట్టె అయితలయ్య, కథ, స్క్రీన్ ప్లే: బి.ఎస్.వి.చారి, సహ నిర్మాతలు: గొల్లపల్లి కిట్టు, బి.వి. చారి, నిర్మాత: పంజాల వీరస్వామి గౌడ్, దర్శకత్వం: ముప్పిడి సత్యం.

    English summary
    Ragilindi Telangana is yet another film whose subject is inspired by the ongoing agitation for a separate Telangana. Suman, Sampath and Parinithi are the main cast members of Ragilindi Telangana. Director Muppidi Sathyam says, "This is a film on the livelihoods of Telanganites. Mirroring the injustice meted out to the people of Telangana from ages, the film weaves into the narrative the contemporary problems dogging the State. This film will be liked by one and all."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X