twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగ్రాట్స్ ఏ.ఆర్.రహ్మాన్!!

    By Staff
    |

    AR Rahman
    ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్‌(43) ను ప్రపంచమంతా పొగడ్తల్లో ముంచెత్తుతోంది. ఆయన తాజాగా మూడు ఆస్కార్‌ నామినేషన్లు దక్కించుకొని భారత సినీ సంగీత చరిత్రలో ఓ నూతనాధ్యాయానికి నాంది పలికారు. ఎంతోకాలంగా భారతీయులను ఊరిస్తున్న కలను నిజం చేసి నిలిపారు. గురువారం అమెరికాలోని శామ్యుల్‌ గోల్డ్‌విన్‌ థియేటర్‌లో 81వ ఆస్కార్‌ పురస్కారాల నామినేషన్లను నటుడు ఫారెస్ట్‌ విట్కర్‌ ప్రకటించారు.

    'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' చిత్రానికి అందించిన సంగీతానికిగానూ ఎ.ఆర్‌.రెహ్మాన్‌కు ఉత్తమ సంగీత విభాగంలో ఒకటి, ఉత్తమ గీత విభాగంలో రెండు సంయుక్త నామినేషన్లు(జై హో, ఓ సాయా) దక్కాయి. ఆస్కార్‌ చరిత్రలో ఓ భారతీయుడికి ఇన్ని నామినేషన్లు రావడం ఇదే ప్రథమం కావటంతో అంతటా ఆశ్చర్యాఆనందాలను ప్రకటిస్తున్నారు. ఉత్తమ గీత విభాగంలో రెహ్మాన్‌తోపాటు పాటల రచయితలు గుల్జార్‌(జై హో), అరుల్‌ప్రగాసం(ఓ సాయా)లు చెరో నామినేషన్‌ పొందారు. 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' చిత్రం మొత్తం 10 నామినేషన్లు(పై మూడింటితో కలిపి) దక్కించుకుంది.

    ఇక తనకు ఇలా అరుదైన ఆస్కార్‌ నామినేషన్లు దక్కడంపై రెహ్మాన్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ''నామినేషన్‌ వస్తుందని ఊహించలేదు. దేవుడు ఎంతో కరుణామయుడు. ఈ చిత్రం గురించి ప్రార్థించిన అందరికీ నా కృతజ్ఞతలు'' అని ఆయన చెప్పారు.అలాగే ఈ ఉత్సాహంతో పలు హాలీవుడ్‌ చిత్రాలకు సంగీతం అందించాలంటూ కొందరు నిర్మాతలు, దర్శకులు తనను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. తొలిసారిగా తన పాటకు ఆస్కార్‌ నామినేషన్‌ దక్కడం భారతీయ సినిమాకు వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నట్లు రచయిత గుల్జార్‌ చెప్పారు.

    అలాగే దేశవ్యాప్తంగా ఈ రోజు (శుక్రవారం) విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారాలను గెలుచుకుంది. ఇప్పటివరకూ భారతీయుల్లో 'గాంధీ' చిత్రానికిగానూ భాను అథియా(కాస్ట్యూమ్‌ డిజైనర్‌), సత్యజిత్‌రేలకు మాత్రమే ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారం దక్కింది. సినిమా రంగానికి చేసిన విశేష సేవలకుగానూ సత్యజిత్‌రేకు గౌరవ ఆస్కార్‌ ఇచ్చారు. ఈ 81వ ఆస్కార్‌ పురస్కారాలను ఫిబ్రవరి 22న ప్రకటిస్తారు. ఈ సందర్బంగా అరుదైన గౌరవం సంపాదించుకుని భారత దేశ ప్రతిష్టను ప్రపంచ వాప్తంగా మరో సారి పెంచినందుకు రెహ్మాన్ కు మనసారా దట్స్ తెలుగు కంగ్రాట్స్ తెలుపుతోంది. పాఠకులు కూడా క్రింది కామెంట్స్ కాలంతో తమ అభినందనల పర్వాన్ని కొనసాగించవచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X