»   »  టైమ్స్ టాప్-10లో రహమాన్ సంగీతం

టైమ్స్ టాప్-10లో రహమాన్ సంగీతం

Posted By:
Subscribe to Filmibeat Telugu


తమిళ సంగీత దర్శకుడు ఎఆర్ రహమాన్ సత్తా ఏమిటో తెలిసిందే. అంతదాకా ఏకచ్ఛాత్రాధిపత్యం చేస్తున్న సంగీత దర్శకులు, గాయకులను తోసిరాజని కొత్తనీరుకు అవకాశం కల్పించిన ఘనత రహమాన్ ది. తమిళంలోనే కాదు ఆయన సత్తాకు తెలుగులోనూ నూతన గాయకులు ఎంతోమంది తమ గాత్రాన్ని ప్రదర్శించే అవకాశం రహమాన్ పుణ్యాన పరోక్షంగా లభించింది. అలాంటి రహమాన్ సంగీత దర్శకత్వం వహించిన రోజా సినిమా మ్యూజిక్ సౌండ్ ట్రాక్ టైమ్స్ మ్యాగజైన్ ఆల్ టైమ్ టాప్-10లో నిలిచింది.

తమిళంలో ఈ సినిమా పేరు ఇసాయి పుయాల్. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారానే రహమాన్ సంగీత దర్శకుడిగా ఆరంగేట్రం చేశాడు. ఈ సినిమాతోనే రహమాన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును పొందాడు. ఆ సంవత్సరం రోజా సౌండ్ ట్రాక్ టైమ్ టాప్-100లో చోటు సంపాదించింది. 2005 తరువాత 2007లో టైమ్ మ్యాగజైన్ లిస్ట్ ను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా సౌండ్ ట్రాక్స్ కోసం నిర్వహించిన ఓటింగ్ లో రోజా టాప్ టెన్ నిలిచింది. ఈ వార్తపై మీ అభిప్రాయమేంటని రహమాన్ ను కదిలిస్తే అంతా అల్లా దయా అని కూల్ అన్నాడు.

Read more about: rahman music director roja
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X