»   »  ఏఆర్ రెహమాన్ నిర్మాతగా మారారు, ఇదిగో వివరాలు

ఏఆర్ రెహమాన్ నిర్మాతగా మారారు, ఇదిగో వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తుతం ఉన్న సంగీత దర్శకుల్లో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి ఏఆర్. రెహమాన్. ఆస్కార్ అవార్డులతో పాటు పలు ఇంటర్నేషనల్ అవార్డులు సైతం సొంతం చేసుకుని ప్రపంచశ్రేణి సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే రెహమాన్ ఇంతటితో ఆగకుండా సినిమా పరిశ్రమలోని ఇతర రంగాల్లో కూడా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలో ఓ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని రెహమాన్ స్వయంగా వెల్లడించారు.

తనకు ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్‌పై ఎప్పటి నుండో ఆసక్తి ఉందని, అయితే విశాల్ భరద్వాజ్ మాదిరి దర్శకత్వం వైపు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేసారు రెహమాన్. తమ మొదటి పొడక్షన్ దాదాపుగా రెడీ అయిందని, ఈ ప్రాజెక్టు హిందీలో రూపొందుతోందని, ప్రొడక్షన్ విషయాలను జాగ్రత్తగా చూసుకునేందుకు అద్భుతమైన టీంను ఏర్పాటు చేసామని రెహమాన్ తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

 Rahman all set become film producer

తాను మణిరత్నంతో పని చేసినా...డానీ బోయెల్‌తో పని చేసినా....ఫిల్మ్ మేకింగ్ గురించి అడిగి తెలుసుకునే వాడిని అని రెహమాన్ తెలిపారు. సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండియాలో నెం.1 స్థానంలో కొనసాగుతూ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన రెహమాన్ నిర్మాణ రంగం వైపు కొత్తగా అడుగులు వేస్తున్నారు.

దర్శకుడు విశాల్ భరద్వాజ్ కూడా గతంలో మ్యూజిక్ డైరెక్టర్. ఆ తర్వాత తన ప్రయాణం సినిమా నిర్మాణం, దర్శకత్వం వైపు సాగించారు. విశాల్ భరద్వాజ్ మాదిరిగానే సినిమా నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్న రెహమాన్ ప్రయాణం విజయవంతం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

English summary
Oscar winning composer A.R. Rahman is all set to turn film producer later this year. He says he always took keen interest in filmmaking process, but has no plans to take up direction a la Vishal Bhardwaj.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu