»   » ఎఆర్ రెహమాన్ ట్యున్స్ కి టబు డాన్స్!

ఎఆర్ రెహమాన్ ట్యున్స్ కి టబు డాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో అందమైన శోభాయమానమగు సౌందర్యము, చాలా చక్కగా స్లిమ్ గా, పొడవుగా ఉండి ప్రేక్షకులకు తన అభినయంతో మత్తేక్కించే టబుకి 40 ఏళ్లు అంటే నమ్మశక్యము కాదు. అలాంటి అమ్మడు ఇప్పుడు ఒక ప్రైవేట్ వీడియో ఆల్బమ్ లో నటిచబోతోంది. చాలా రోజు గా మనం ఆమెను బుల్లి తెర మీద చూడలేదు. అందుకే కాబోలు ప్రస్తుతం రషీద్ అలి ఆల్బమ్ లో డాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ తార ఇప్పటి వరకు ఒక్క ప్రైవేట్ గీతానికి కూడా నత్యాన్ని చేయలేదు..కానీ ఇప్పుడు ఓ పాట కోసం పాదం కదిపేందుకు ఒప్పుకుంది..ఇంతకీ ఆ పాటకు నర్తించమని టబుని ఎవరు అడిగారో తెలుసా! సంగీత సామ్రాజ్య సార్వభౌముడు ది గ్రేట్ గ్రామీ అవార్డ్సు గ్రహీత ఎఆర్ రెహమన్. ఆ పాటను రెహమాన్ స్వరపరచగా గతంలో 'కభీ కభీ అదితి.." అనే సాంగ్ ను పాడి పాపులరైన రషీద్ గానం చేశాడు.

రెహమాన్ మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టపడే టబు ఆయనే స్వయంగా వచ్చి అడగడంతో వెంటనే అంగీకారం తెలిపిందని సమాచారం. అంతే కాదు..ఈ గీతంలో ఫుల్ గా మసాలా అందించనుందని కూడా సమాచారం. ఈ కార్యక్రమం త్వరలో హైదరాబాద్ లో రూపొందనుందని సమాచారం. మరి టబు డాన్స్, రెహమాన్ ట్యూన్స్ తో మరో అవార్డును గెలుచుకొంటారేమో చూడాలి మరి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu