twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కసుమూరు దర్గాలో ఏఆర్‌ రహమాన్‌

    By Srikanya
    |

    Rahman
    హైదరాబాద్ : శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కసుమూరు దర్గాను స్వరమాంత్రికుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రహమాన్‌ మంగళవారం రాత్రి సందర్శించారు. మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో దర్గాకుకు రహమాన్‌తో పాటు తల్లి కరీమాబేగం వచ్చారు. ఈసందర్భంగా మస్తాన్‌వలీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రహమాన్‌ రాకతో దర్గా ముజావర్లు సులేమాన్‌, సుబహాని, ఆసిఫ్‌లు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రహమాన్‌ను చూసేందుకు భక్తులు, స్థానికులు పోటీపడ్డారు. అనంతరం ఇక్కడి నుంచి కడప దర్గాకు బయలుదేరారు.

    ఇక రహమాన్ ప్రస్తుతం వరస చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ... కూర్చునేందుకు కూడా తగినంత సమయమే దొరకడం లేదని చెప్పాడు. ఇంకా తాను కెరీర్ ఆరంభదశలోనే ఉన్నానని రెండు అకాడమీ పురస్కారాలు గెలుచుకున్న ఈ సంగీతదర్శకుడు అన్నారు. మద్రాస్ మోజర్ట్ గా అభిమానుల హృదయాల్లో చోటుసంపాదించుకున్న రహమాన్.. తన కెరీర్ ఆరంభంలో అనేక డాక్యుమెంటరీలు, బుల్లితెర ధారావాహికలకు సంగీతమందించాడు.

    ' తీరిగ్గా గడిపేందుకు నాకు సమయమే దొరకడం లేదు. నేను చేయాల్సింది ఇంకా బోలెడంత ఉంది. సంగీత పాఠశాలతోపాటు ఇంకా అనేక ప్రాజెక్టులు చేయాల్సి ఉంది. ఇవ న్నీ నాకు క్షణం తీరిక లేకుండా చేస్తున్నాయి. సంగీత ం సమకూర్చడం కోసమే ఇక్కడ ఉన్నా. ఇది నిర్విరామంగా కొనసాగుతుంది' అని రహమాన్ చెప్పాడు.ప్రసూన్ జోషి రాసిన జరియా అనే పాటతోపాటు మరో రెండు తమిళ పాటలకు సంగీతం సమకూర్చనున్నాడు. ఇందుకోసం ప్రసూన్ జోషితోపాటు వలి (తమిళ రచయిత) లతో కలసి పనిచేస్తున్నట్టు రహమాన్ చెప్పాడు.

    మణిరత్నం దర్శకత్వంలో రూపొంది ...1992లో విడుదలైన రోజా సినిమా.. రహమాన్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత రంగీలా, తాళ్, దిల్‌సే, జోధా అక్బర్, స్వదేశ్, రంగ్ దే బసంతి, జబ్ తక్ హై జాన్, రాంఝనా. తదితర సినిమాలకు రహమాన్ అందించినస్వరాలు సంగీత ప్రియుల ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాంఝనా చిత్రం సంగీతపరంగా కూడా అందరినీ ఆకట్టుకుని రహమాన్ ప్రత్యేకతను మరోసారి ప్రపంచం ముందు ఉంచింది.

    English summary
    Oscar winner A.R Rahman visited Kasumuru dargah in Sri Pottti Sriramulu Nellore district and offered special prayers on Wednesday. The Khwaja and other community elders blessed Rahman.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X