For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rahul Ramakrishna: తండ్రి కాబోతున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ.. పెళ్లి సంగతి చెప్పలేదేంటి బ్రో?

  |

  తెలుగు చిత్రసీమలో తెలంగాణ నుంచి మంచి కమెడియన్ గా నటుడిగా గుర్తింపు పొందాడు రాహుల్ రామకృష్ణ. అతి తక్కవ సమయంలోనే కమెడియన్ గా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. రాహుల్ రామకృష్ణ మొదటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన సైన్మా అనే షార్ట్ ఫిలిం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

  ఆ తర్వాత జయమ్ము నిశ్చయమ్మురా అనే సినిమాతో టాలీవుడ్ వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత రాహుల్ రామకృష్ణ తిరిగి చూసుకులేదు. ఇదిలా ఉంటే అప్పుడప్పుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా చేసే కామెంట్స్ కాంట్రవర్సీ అవుతుంటాయి. కానీ, తాజాగా ఆయన తండ్రి కాబోతున్నట్లు ప్రకటించి అందరనీ ఆశ్చర్యపరిచాడు.

  జోడిగా మాధవి లత..

  జోడిగా మాధవి లత..

  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి తెలంగాణ రాష్ట్రం నుంచి పరిచయమైన యాక్టర్ అండ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ. సైన్మా అనే షార్ట్ ఫిలీంతో నటుడిగా తెరంగేట్రం చేసిన ఈ కమెడియన్ నటన అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇందులో రాహుల్ రామకృష్ణకు జోడిగా మాధవి లత నటించింది. ఈ షార్ట్ ఫిలింలో నటీనటులు మాట్లాడిన తెలంగాణ స్లాంగ్ విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా రాహుల్ రామకృష్ణ తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టాడు.

  వరుసపెట్టి సినిమాలతో..

  వరుసపెట్టి సినిమాలతో..

  సైన్మా తర్వాత సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో యమ పాపులర్ అయ్యాడు. ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో హీరోకు ఫ్రెండ్ గా నటించి అద్భుతమైన నటన కనబర్చాడు. ఈ చిత్రంతోనే ఆయనకు చాలా పాపులారిటీ వచ్చింది. ఈ ఫేమ్ తో వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు రాహుల్ రామకృష్ణ.

  విక్టరీ వెంకటేష్ కు అసిస్టెంట్ గా..

  విక్టరీ వెంకటేష్ కు అసిస్టెంట్ గా..

  ఈ క్రమంలోనే దగ్గుబాటి రానా, సాయి పల్లవిలు జంటగా నటించిన విరాట పర్వం, మాస్ మహారాజ్ రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటి వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. రామారావు ఆన్ డ్యూటీలో చిన్నపాటి నెగెటివ్ పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఇక ఇటీవల విశ్వక్ సేన్ లవ్ అండ్ రొమాంటిక్ చిత్రం ఓరి దేవుడా లో కూడా అలరించాడు. దేవుడిగా నటించిన విక్టరీ వెంకటేష్ కు అసిస్టెంట్ గా ఆకట్టుకున్నాడు.

  'హాయ్ టు మై వైఫ్' అంటూ..

  'హాయ్ టు మై వైఫ్' అంటూ..

  ఇదిలా ఉంటే అప్పుడప్పుడూ రాజకీయ, సామాజిక పరమైన విషయాలపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు రాహుల్ రామకృష్ణ. ఇటీవల తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెబుతూ అర్జున్ రెడ్డి స్టైల్ లో ప్రకటించాడు. తనకు కాబోయే భార్యకు లిప్ కిస్ ఇస్తున్న పిక్ షేర్ చేసి వార్తల్లో నిలిచాడు. 'హాయ్ టు మై వైఫ్' అంటూ ప్రకటించిన రాహుల్ రామకృష్ణ తన వివాహం గురించి ఎక్కాడ ప్రస్తావించలేదు.

  అసలు పెళ్లి ఎప్పుడు అయింది..

  అసలు పెళ్లి ఎప్పుడు అయింది..

  ఇప్పుడు తాజాగా తన భార్య గర్భవతిగా ఉన్న ఫొటో షేర్ చేస్తూ 'మీట్ అవర్ లిటిల్ ఫ్రెండ్' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ అతి కొద్ది సమయంలోనే వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రాహుల్ రామకృష్ణకు విషెస్ చెప్పడం పక్కన పెట్టి.. అసలు పెళ్లి ఎప్పుడు అయిందని ఆశ్చర్యంలో మునిగిపోయారు. అయితే ఇదివరకు పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పిన రాహుల్ రామకృష్ణ తన పెళ్లి గురించి మళ్లీ ఎక్కడా చెప్పలేదు.

  కొంచమైనా చెప్పనే లేదు..

  ప్రస్తుతం తండ్రి కాబోతున్నట్లు పెట్టిన పోస్ట్ కు 'ఎంట్రీ బ్రో పెళ్లి సంగతి కొంచమైనా చెప్పనే లేదు' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాహుల్ రామకృష్ణ అర్జున్ రెడ్డి, భరత్ అను నేను, జాతి రత్నాలు సినిమాలతో ఫుల్ పాపులర్ అయ్యాడు. ఈ చిత్రాల్లో అతని మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి, రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన RRRలో కూడా నటించాడు ఈ కమెడియన్.

  English summary
  Comedian And Actor Rahul Ramakrishna Announces He Is Going To Be A Father In Twitter And Netizens When You Get Married.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X