For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కవలలకు జన్మనిచ్చిన టాలీవుడ్ జంట.. హీరో ఇంట్లో సంబరాలు షురూ.. పేర్లు, ఫొటోలు వైరల్

  |

  సినీ రంగంలో ఎంతో మంది ప్రేమాయణం సాగిస్తూ ఉంటారు. అయితే, అందులో కొందరు మాత్రమే తమ బంధాన్ని పెళ్లి పీటల వరకూ తీసుకు వెళ్తుంటారు. అలా చాలా కాలం క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న వారిలో సింగర్ చిన్మయి శ్రీపాద, ప్రముఖ హీరో రాహుల్ రవీంద్రన్ జంట ఒకటి. సుదీర్ఘ కాలంగా ఈ జోడీ కెరీర్‌ల మాదిరిగానే తమ వివాహ బంధాన్ని కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటూ వస్తోంది. వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిన్మయి.. రాహుల్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయాన్ని వాళ్లు సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మీరే చూడండి!

  చిన్మయి ఇలా.. రాహుల్ కెరీర్ అలా

  చిన్మయి ఇలా.. రాహుల్ కెరీర్ అలా

  చిన్మయి సింగర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే డబ్బింగ్ ఆర్టిస్టుగానూ పని చేసింది. ఇలా ఆమె ఎంతగానో ఫేమస్ అయిపోయింది. రాహుల్ రవీంద్రన్ 'మద్రాసి' అనే తమిళ చిత్రంతో తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత తెలుగులో 'అందాల రాక్షసి' ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఇక్కడే స్థిరపడి డైరెక్టర్‌గానూ మారాడు. ఈ క్రమంలోనే పలు చిత్రాలు తీశాడు.

  యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ బయట పెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నాడంటూ ఎమోషనల్

  ప్రేమ వివాహం చేసేసుకున్న జోడీ

  ప్రేమ వివాహం చేసేసుకున్న జోడీ

  'అందాల రాక్షసి' సినిమాలో హీరోయిన్‌కు చిన్మయి డబ్బింగ చెప్పింది. ఆ సమయంలోనే రాహుల్ రవీంద్రన్‌తో ఆమె ప్రేమలో పడింది. అలా ఏడాది పాటు లవ్ ట్రాక్ నడిపిన వీళ్లిద్దరూ.. 2014లో పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి అన్యోన్యంగా ఉంటూ.. ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తమ కెరీర్‌లనూ ముందుకు తీసుకెళ్తున్నారు.

  కవలలకు జన్మనిచ్చిన చిన్మయి

  కవలలకు జన్మనిచ్చిన చిన్మయి

  ఎనిమిదేళ్లుగా తమ వైవాహిక జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటూ వస్తోన్న సింగర్ చిన్మయి.. హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దంపతులు తాజాగా తమ అభిమానులకు అదిరిపోయే శుభవార్తను అందించారు. ఈ జంట పండంటి మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అంటు చిన్మయి.. ఇటు రాహుల్ తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది.

  Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ వారసుడు.. అందుకోసమే ఒప్పుకున్న యంగ్ హీరో

  పేర్లు, ఫొటోలు చూపిస్తూ పోస్టులు

  పేర్లు, ఫొటోలు చూపిస్తూ పోస్టులు

  చిన్మయి, రాహుల్ తమకు కవల పిల్లలు జన్మించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ మేరకు తమ కుమారుల చిట్టి చేతులను పట్టుకున్న ఫొటోలను కూడా వదిలారు. అంతేకాదు, వీళ్లకు 'దృప్త, శర్వాస్' అనే పేర్లు పెట్టినట్లు కూడా వెల్లడించారు. అలాగే, 'మా జీవితాల్లో అసలైన మధుర క్షణాలు ఇవే' అంటూ వీళ్లిద్దరూ పోస్టులు కూడా చేశారు.

  సెలెబ్రిటీల పోస్టులతో ట్రెండింగ్

  సెలెబ్రిటీల పోస్టులతో ట్రెండింగ్

  సింగర్ చిన్మయి శ్రీపాద, హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ పండంటి కవల పిల్లలకు జన్మనివ్వడంతో ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అవుతోంది. ఇక, వీళ్లకు సినీ రంగానికి చెందిన ఎంతో మంది సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు. అలాగే, వీళ్ల అభిమానులు కూడా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఫలితంగా ఇంటర్నెట్‌లో ఈ జంట ట్రెండింగ్ అవుతోంది.

  ఉల్లిపొర లాంటి బట్టల్లో దిశా పటానీ రచ్చ: అవి కూడా కనిపించేలా.. ఆమెనిలా చూస్తే!

  ఆ సినిమాలో జంటగా నటించారు

  ఆ సినిమాలో జంటగా నటించారు


  సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా సుదీర్ఘ కాలంగా పని చేస్తోన్న చిన్మయి ఇటీవలే ఓ సినిమాలో నటించింది. అదే అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఇందులో తన భర్త రాహుల్ రవీంద్రన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె.. కథను నడిపించే పాత్రలో కనిపించింది. ఆ తర్వాత గర్భవతి అవడంతో కెరీర్‌కు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.

  English summary
  Chinmayi Sripada and Rahul Ravindran Blessed with Twin Boys on June 21. The Couple Sheres This News Via Their Social Media Accouts.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X