»   » ఖరీదైన ప్రేమ: అసిన్ కోసం కోట్లు ఖర్చు పెట్టాడు

ఖరీదైన ప్రేమ: అసిన్ కోసం కోట్లు ఖర్చు పెట్టాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అసిన్ త్వరలో మైక్రోమాక్స్ అధినేత రాహుల్ శర్మను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. తొలుత అసిన్ పై మనసు పారేసుకున్న రాహుల్ శర్మ తన ఫ్రెండ్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ద్వారా ఆమెకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తన ప్రేమను ప్రపోజ్ చేసాడు. అసిన్ అంగీకరించడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన రాహుల్ శర్మ..... రూ. 6 కోట్ల విలువ చేసే 20 క్యారెట్ల వజ్రపుటుంగరాన్ని ఆమె వేలికి తొడిగాడట. ఆ ఉంగరాన్ని ఏఆర్(అసిన్-రాహుల్)అక్షరాలతో డిజైన్ చేయించాడట.

అసిన్ ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, ప్రేమ ఎలా పుట్టింది, పెళ్లికి దారి తీసిన పరిణామాలు వివరించింది. తమ మధ్య బంధం బలపడటానికి కారణం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అనే అసిన్ చెప్పుకొచ్చారు. రాహుల్, అక్షయ్ స్నేహితులు కావడమే ఇందుకు కారణం అంటోంది. అంతే కాదు తమ మధ్య సంథింగ్ మొదలైందని అక్షయ్ మొదట్లోనే కనిపెట్టేసి ప్రోసీడ్ అన్నాడట.

రాహుల్ శర్మతో పరిచయం, ప్రేమ వ్యవహారం అనుకోకుండా జరిగిందని అసిన్ తెలిపారు. గజిని సినిమాలోలానే నా జీవితంలో జరిగింది. తొలిసారి ముంబై విమానాశ్రయంలో కలుసుకున్నామని తెలిపారు. తొలుత నన్ను హాయ్ అంటూ పలకరించారు. తర్వాత విమానంలో పక్క పక్కనే కూచున్నాం. అప్పటి నుండి ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం అని అసిన్ తెలిపారు. ఒకానొక రోజు అతడే ఫోన్ చేసి చెప్పాడు. మీ ఇంట్లో వాళ్లను కలుస్తా. పెళ్లికి ఒప్పిస్తానని చెప్పాడు. అతను జంటిల్మెన్‌లా ప్రపోజ్ చేసిన తీరు నచ్చిందని అసిన్ చెప్పుకొచ్చింది.

Rahul Sharma proposed to Asin with a 20 carat ring costing Rs 6 crore

సౌత్ లో అసిన్ కు బాగా పేరు తెచ్చిన సినిమా ‘గజిని'. సౌత్ లో ఈ సినిమాలో సూర్య హీరోగా నటించగా... ఇదే సినిమాను బాలీవుడ్లో అమీర్ ఖాన్ హీరోగా రీమేక్ చేసారు. ఈ సినిమాలో హీరో మొబైల్ కంపెనీ యజమాని. నిజ జీవితంలోనూ అసిన్ మొబైల్ కంపెనీ యజమానితో ప్రేమలో పడటం కాకతాళీయమే.

అచ్చం గజినీ సినిమాలో హీరోకు ఉన్న లక్షణాలే తనకు కాబోయే భర్తుకు ఉన్నాయంటోంది అసిన్. రాహుల్ గజిని టైపే. గజినిలో సంజయ్ సింఘానియా (సూర్య) ఓ మొబైల్ కంపెనీ ఓనర్. తర్వాత మతిమరుపు గజినిగా కనిపిస్తాడు. అందులో ఆరెంజ్ కలర్ కార్ ని వాడతాడు. ఇవన్నీ రాహుల్ నిజజీవితంలోనూ ఉన్నాయని అంటోంది అసిన్.

English summary
Rahul Sharma proposed to Asin a year ago with a 20 carat ring costing Rs 6 crore.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu