»   »  పోలీసు కేసు పెట్టిన హీరోయిన్

పోలీసు కేసు పెట్టిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ అమ్మాయి సినిమా ఒక్కటి రిలీజయిందో లేదో అప్పుడే బాయ్ ఫ్రెండుని పట్టించుకోవటం మానేసిందిట. దాంతో అలిగిన అతగాడు ఆమెపై చెయ్య చేసుకున్నాడుట. దాంతో ఆమె అతనిపై పోలీసు కేసు పెట్టింది. ఇదంతా చదువుతోంటే వర్మ 'రంగీలా' కథ గుర్తుకు వస్తోంది కదూ. ఇప్పుడు ముంబాయి ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ జీవితంలో అదే జరుగుతోంది. ఆమె ప్రస్తుతం వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో రెడీ అవుతున్న 'రెయిన్ బో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఆమె బాలీవుడ్ లో చేసిన మొదటి సినిమా 'జన్నత్' క్రిందటి వారం రిలీజైంది.

ఇక ఆమె బాయ్ ఫ్రెండ్ సాహిల్ జరూ . ఆమె ఆఫర్ల ఒప్పుకోవటం, ప్రారంభమైన సినిమాలు పూర్తి చేయటంలో బిజీగా ఉండి అతన్ని పట్టించుకోలేదట. దాంతో ఆమె లెవిల్ పెర్గిందని అందుకే తనకు ఫోన్ లు కూడా చెయ్యటం లేదని అతను భావించి ఆమెని ఎయిర్ పోర్ట్ లో కలిసి గొడవ పడ్డాడట. ఆమె మొబైల్ కూడా నేలకేసి విసిరి కొట్టాడట. పబ్లిక్ గా అందరి ఎదురుగా ఈ సంఘటన జరగటం ఆమె ఉక్రోషంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. దాంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X