»   »  ఐదుగురు డైరక్టర్లు పనిచేసిన సినిమా...

ఐదుగురు డైరక్టర్లు పనిచేసిన సినిమా...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rainbow
మనసంతా నువ్వే,నేనున్నాను వంటి హిట్ చిత్రాల దర్శకుడు వి.ఎన్.ఆదిత్య దర్శక తొలి సారి నిర్మాత గా మారి చేస్తున్న చిత్రం రెయిన్ బొ. హ్యాపీడేస్ ఫేం రాహుల్, సింధుమీనన్, సోనల్ చౌహాన్ (జన్నత్ ఫేం) లు జంటగా నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకుని అక్టోబర్ రెండు న రిలీజ్ కానున్నది. ఇక ఈ చిత్రం గురించిన కొన్ని విశేషాలను ఈ రోజు హైదరాబాద్ లో గల హంపి రెస్టారెంట్ జరిగిన ఒక ప్రెస్ మీట్ లో తెలియజేసారు.


ఈ మీట్ లో దర్శకుడు ఆదిత్య, పరచూరి వెంకటేశ్వర రావు, గాయని సునీత, సంగీత దర్శకుడు నిహాల్, హీరో రాహుల్, సోనల్ చౌహాన్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరచూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ "నా శిష్యుడు ఆదిత్య నిర్మాత గా కూడా మారినందుకు నాకు చాలా సంతోషం గా వుంది. ఈ చిత్రం అన్ని రకాల ఎమోషన్స్ నీ కలిగి వుంటుంది, హీరో రాహుల్ పాత్ర ప్రతి ఒక్కరినీ కదిలిస్తూ, చాలా ఆసక్తికరం గా మలచబడింది " అని అన్నారు.

దర్శక నిర్మాత ఆదిత్య మాట్లాడుతూ పరచూరి బ్రదర్స్ కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాలకు తాను పని చేసాననీ ఆ స్ఫూర్తి తోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాననీ అన్నారు. అలాగే ఒక చిత్రానికి ఒక దర్శకుడే పని చేస్తారనీ కానీ ఈ చిత్రంలో ఐదుగురు దర్శకులు వున్నారనీ తాను దర్శకత్వం వహించిన దర్శకుడైతే, రాజమౌళి, సముద్ర, శ్రీను వైట్ల, కోడి రామ కృష్ణలు కీలక పాత్రల్లో నటించారనీ, దర్శకులు గా వారు చాలా బిజీ గా వున్నప్పటికీ తాను అడిగినవెంటనే తన చిత్రం లో నటించినందుకు వారికి తాను కృతజ్ఞుడననీ అన్నారు. ఇక తొలి సారిగా ఈ నిర్మాత అనుభవం కొంచం కొత్తగా వుందని, ఇందులో వుండే సాదక బాదకాలన్నీ అర్దమయ్యాయనీ, ఒక నిర్మాత మీద ఎంత ఒత్తిడి వుంటుందో తనకు ఈ చిత్రం తో అర్దం అయ్యిందనీ అందుకే తన గత చిత్రాల నిర్మాతలనందరినీ తాను ఈ సందర్భంగా అభినందిస్తున్నానీ, ఇక ఈ చిత్రం ఒక చక్కని ప్రేమకావ్యం గా రూపొందిందనీ, చూడడానికి వచ్చిన ప్రేక్షకుడు నిరాశ తో మాత్రం తిరిగి వెళ్ళడనీ అన్నారు.

హ్యాపీడేస్ చిత్రం ద్వారా ఒక చక్కని గుర్తింపు లభించిందనీ ఇప్పుడు ఈ రెయిన్ బో చిత్రం ద్వారా నటుడి గా తనను తాను ప్రూవ్ చేసుకొనే పాత్ర లభించిందనీ డెఫినెట్ గా ఈ చిత్రం లోని తన పాత్ర అందరినీ ఆకట్టుకొంటుందని హీరో రాహుల్ తెలిపారు. హీరోయిన్ సోనల్ మాట్లాడుతూ తెలుగులో చేస్తున్న తొలి చిత్రం అనీ తనకు చాలా చక్కని అనుభవం అని డెఫినెట్ గా ఈ చిత్రం విజయం సాధిస్తుందనీ అన్నారు.

తాను తొలి సారిగా సంగీత దర్శకత్వం వహించాననీ అన్ని పాటలూ ప్రజాదరణ పొందాయనీ గాయకుడు నిహాల్ అన్నారు. భల బద్ర పాత్రుని రమణి అందించిన కధ తో రూపొందిన ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీని అందించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X