»   »  సుధీర్, రష్మీ మధ్య వ్యవహారం..వాడుకుని వదిలేస్తారు, కారణం హైపర్ ఆదినే!

సుధీర్, రష్మీ మధ్య వ్యవహారం..వాడుకుని వదిలేస్తారు, కారణం హైపర్ ఆదినే!

Subscribe to Filmibeat Telugu
మహేష్, ప్రభాస్ లాగా పుట్టుంటే బావుండేది

బుల్లి తెరపై బుల్లి తెరపై దుమ్ములేపుతున్న టివి కార్యక్రమాల్లో జబర్దస్త్ కూడా ఒకటి. హాస్య ప్రియులకు ప్రియమైన షోగా జబర్దస్త్ మారిపోయింది. జబర్దస్త్ షో ఎంత పాపులర్ అయిందో అంతేస్థాయిలో దీనిచుట్టూ వివాదాలు కూడా ఉన్నాయి. డబుల్ మీనింగ్ డైలాగులతో కుటుంబం కలసి విధంగా ఈ షో తయారవుతోందంటూ మండిపడుతున్నారు. మరో వైపు ఈ షో నుంచి పలువురు హాస్య నటులు సినిమా అవకాశాలని పొందుతున్నారు. మరికొందరు పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. రైజింగ్ రాజు కూడా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు. లేడి గెటప్స్ లో రైజింగ్ రాజు కడుపుబ్బా నవ్విస్తున్న సంగతి తెలియందే.

 లేడీ గెటప్స్ తో పాపులారిటీ

లేడీ గెటప్స్ తో పాపులారిటీ

జబర్దస్త్ లో హైపర్ ఆది టీంలో రైజింగ్ రాజు సభ్యుడు. లేడి గెటప్స్ తో రైజింగ్ రాజు మంచి గుర్తింపు పొందారు. ఇటీవల ఇంటర్వ్యూ లో రైజింగ్ రాజు పలు విషయాలు వెల్లడించాడు.

వాడుకుని వదిలేస్తారా

వాడుకుని వదిలేస్తారా

జబర్దస్త్ లో టీం లీడర్స్ సభ్యులని వాడుకుని డబ్బులు ఇవ్వకుండా వదిలేస్తారా అనే ప్రశ్నకు రైజింగ్ రాజు సమాధానం ఇచ్చారు. అన్ని టీంల గురించి నాకు తెలియదని రైజింగ్ రాజు అన్నారు. కానీ మా టీం వరకు హైపర్ ఆది అలాంటి వారు కాదని, సభ్యులందరికి డబ్బులు ఇస్తారని అన్నారు. మిగిలి టీంల గురించి ఆ సభ్యులనే అడిగి తెలుసుకోవాలని సూచించారు.

 అందుకు కారణం హైపర్ ఆదినే

అందుకు కారణం హైపర్ ఆదినే

హైపర్ అది ఎప్పుడూ రైజింగ్ రాజు శరీరంపై పంచులు వేస్తుంటాడు.దీనికి మీరు ఫీలవరా అనే ప్రశ్నకు రైజింగ్ రాజు భిన్నంగా స్పందించాడు. తనకు జనాల్లో పాపులారిటీ పెరగడానికి కారణం ఆదిగారే అని రైజింగ్ రాజు అన్నారు. నా శరీరంపై పంచులు వేస్తె అది నాకే ప్లస్ అని ఆయన అన్నారు.

ఎన్టీఆర్ కూడా అదే చేశారు

ఎన్టీఆర్ కూడా అదే చేశారు

తెలుగు వారు ఆరాధించే ఎన్టీఆర్ కూడా రాజబాబు, రేలంగి వంటి వారి శరీరాలపై హాస్యం పండించారని, దానివల్ల వారి పాపులారిటీ ఇంకా పెరిగిందని అన్నారు.

 మహేష్, ప్రభాస్ లాగా

మహేష్, ప్రభాస్ లాగా

మహేష్, ప్రభాస్ లాగా పుట్టుంటే బావుండేదని అంతా అనుకుంటారు. కానీ దేవుడు మనకు ఇచ్చిన రూపంతోనే దూసుకుపోవాలని రైజింగ్ రాజు అన్నారు.

 రైటర్, డైరెక్టర్ అతనిలో

రైటర్, డైరెక్టర్ అతనిలో

హైపర్ ఆదిలో మంచి రైటర్, దర్శకుడు ఉన్నాడని అనిపిస్తుందని రైజింగ్ రాజు అన్నారు. ఆది స్కిట్ ని సిద్ధం చేసుకునే విధానం చాలా బావుంటుందని రైజింగ్ రాజు తెలిపారు.

 సుధీర్, రష్మీపై పంచులు

సుధీర్, రష్మీపై పంచులు

స్కిట్ మధ్యలో సుధీర్, రష్మీపై పంచులు పడుతుంటాయి. అది కేవలం సరదా, హాస్యం పండించేందుకు మాత్రమే అని రైజింగ్ రాజు తెలిపారు. వారి మీద పంచులు వేయడంలో మరో ఉద్దేశం లేదని తెలిపాడు.

సుధీర్, రష్మీ మధ్య ఎఫైర్

సుధీర్, రష్మీ మధ్య ఎఫైర్

సుధీర్, రష్మీ మధ్య ఎఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని రైజింగ్ రాజు తెలిపాడు. వారిద్దరూ సరదాగా కనిపించడం వలన అలా అనుకుంటారని తెలిపాడు. ఆ మాటకు వస్తే జబర్దస్త్ లో అంతా సరదాగానే ఉంటారని రైజింగ్ రాజు వివరణ ఇచ్చారు.

English summary
Raising Raju comments on Sudheer and Rashmi love affair. He praised Hyper Aadi
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X