»   » నిర్మాత రాజ్ కందుకూరి చేతులమీదుగా 'డ్రీమ్‌బాయ్'

నిర్మాత రాజ్ కందుకూరి చేతులమీదుగా 'డ్రీమ్‌బాయ్'

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజేష్ కనపర్తి దర్శకత్వంలో, రేణుక నరేంద్ర నిర్మాతగా మాస్టర్ ఎన్ టి రామ్ చరణ్ సమర్పణలో సెవన్ వండర్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం 1 గా తెరకెక్కనున్న చిత్రం 'డ్రీమ్ బాయ్'. తేజ, హరిణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నేడు హైదరాబాద్ లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా, మరో నిర్మాత ఏం వి రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో ధనరాజ్, రాకేష్, సుఖేష్ రెడ్డి, లడ్డు, ఆర్ట్ డైరెక్టర్ వెంకట్ సన్నిధి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజేష్ కనపర్తి మాట్లాడుతూ.. ఇదొక థ్రిల్లింగ్ ఎంటర్టైనర్. ప్రేమతో నిండిన క్యూట్ స్టోరీ ఇది. అలాగే సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. కొత్త, పాత నటీనటులతో ఈ చిత్రాన్ని లావిష్ గా తెరకెక్కించనున్నాం. ఆద్యంతం కామెడీతో ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది..అన్నారు.

Raj Kandukuri claps for Dream Boy movie

చిత్ర నిర్మాత రేణుక నరేంద్ర మాట్లాడుతూ.. మా డైరెక్టర్ రాజేష్ చెప్పిన కథ ఎంతో నచ్చింది. ఈ చిత్రం ఈ రోజు నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నాం. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పొందు పరచనున్నాం. ఈ చిత్రం మాకు, మా బ్యానర్ కు మంచి నేమ్ తెస్తుందని ఆశిస్తున్నాం.. అన్నారు.
తేజ, హరిణి రెడ్డి, ధనరాజ్, రాకేష్, సుఖేష్ రెడ్డి, లడ్డు, గౌతమ్ రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: నాని, సంగీతం: సుభాష్ ఆనంద్, కో డైరెక్టర్: రాధా కృష్ణ, నిర్మాత: రేణుక నరేంద్ర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజేష్ కనపర్తి.

English summary
Dream boy movie muhurtham shot program happend in Hyderabad. Raj Kandukuri claps for Dream Boy. Teja, Harini Reddy are the Hero, Heroines. comedian Dhanraj and others are attended for this event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu