»   » పబ్లిసిటీ కోసమే నాతో లవ్ అఫైర్!

పబ్లిసిటీ కోసమే నాతో లవ్ అఫైర్!

Posted By: Rajababu
Subscribe to Filmibeat Telugu

అలనాటి బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్, వైజయంతిమాల మధ్య అఫైర్ వివాదాస్పదంగా మారింది. పబ్లిసిటీ కోసం అతిగా పాకులాడే రాజ్ కపూర్ తనతో ప్రేమ వ్యవహారం ఉందంటూ రూమర్ సృష్టించారని, అయితే ఆయన ప్రచారం చేసుకొన్న విధంగా తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని వైజయంతిమాల స్పందించారు. అయితే వైజయంతిమాల చేసిన వ్యాఖ్యాలను రాజ్ కపూర్ తనయుడు రిషికపూర్ తప్పుపట్టారు. ఈ అంశంపై రిషి స్పందిస్తూ 'మా నాన్న జీవించి ఉంటే వైజయంతిమాల ఆ విధంగా మాట్లాడి ఉండేవారు కాదు' అని అన్నారు.

Vyjayanthimala Contraversy statement on Raj Kapoor

బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ జీవితంలో పలు అంశాలను తన ఆటోబయోగ్రఫీ 'ఖుల్లం ఖుల్లా: రిషికపూర్ అన్ సెన్సార్డ్'లో పేర్కొన్నారు. ఆర్కే బ్యానర్లలో నటించిన నర్గీస్ తోపాటు అగ్రహీరోయిన్లు అందరితోనూ తన తండ్రికి అఫైర్ ఉందని ఈ పుస్తకంలో రిషికపూర్ తెలిపారు. ఈ పుస్తకం ఇటీవల ముంబైలో విడుదల చేశారు. ఈ పుస్తకం ఆవిష్కరణను పురస్కరించుకొని రిషికపూర్ తన స్నేహితులతో కలిసి తిరుమలలోని శ్రీవారిని దర్శించుకొన్న సంగతి తెలిసిందే.

English summary
Vyjayanthimala Contraversy statement on Raj Kapoor
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu