»   » డీజే కోసం మారువేషం వేశాడు: హీరోల కష్టాలు హీరోలవి మరి

డీజే కోసం మారువేషం వేశాడు: హీరోల కష్టాలు హీరోలవి మరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

డీజే నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా ఆ ప్రభావం కథ నడిపిన తీరు మీదే తప్ప అటు బన్నీ కి గానీ ఇటు పూజాకి గానీ మైనస్ అవలేదు. ఎంత నెగెటివ్ టాక్ వచ్చినా స్టైలిష్ స్టార్ దువ్వాడ జగన్నాధం మొదటిరోజు కలెక్షన్స్ ఆయన కెరీర్ మొత్తంలోనే బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ గా రికార్డు నమోదయ్యింది. మొదటిరోజు నైజాం ఏరియాలో రూ 4.85 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇది నైజాం ఏరియాలో బన్నీకి అత్యుత్తమ రికార్డు. వేరే ఏరియాల విషయానికి వస్తే, డ్ఝ్ మొదటి రోజు కలెక్షన్స్ అల్లు అర్జున్ ఇంతకముందు సినిమాల మొదటిరోజు కలెక్షన్స్ ని మించి వచ్చాయి అని ట్రేడ్ వర్గాల టాక్.

ఈ సినిమా చూసేందుకు ఓ యంగ్ హీరో త‌న గెట‌ప్ మార్చి థియేట‌ర్ కి వెళ్ళ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌ల అంధ‌గాడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రాజ్ త‌రుణ్ ప్రస్తుతం అమలాపురం పరిసరాల్లో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. అయితే తొలి రోజే బ‌న్నీ మూవీ చూడాలని భావించిన రాజ్ త‌రుణ్ మారు వేషంలో గెడ్డం పెట్టుకొని అమలాపురంలోని ఓ థియేటర్‌కి వెళ్లి సినిమా చూసాడు.


 Raj Tarun Becomes A Baba To Watch DJ

అమలాపురంలోని ఓ థియేటర్‌కి వెళ్లి దువ్వాడ జగన్నాథమ్ సినిమాను చూసినట్లు ఓ ఫోటోను కూడా రాజ్‌తరుణ్ షేర్ చేశాడు. ఒరిజినల్ గెటప్‌లో వెళ్తే సినిమాకు వచ్చిన వాళ్లు గుర్తుపట్టే ప్రమాదం వుందని భావించిన రాజ్ తరుణ్... గడ్డం విగ్గు, కళ్లద్దాలు, క్యాప్ ధరించి మారువేషంలో వెళ్లి డీజే సినిమా చూశాడు. ఈ విధంగా బన్నీపై తన అభిమానాన్ని రాజ్‌తరుణ్ చాటుకున్నాడు. ఇందుకు సంబంధించి ఓ ఫోటోను షేర్ చేసి విష‌యాన్ని వివ‌రించాడు రాజ్ త‌రుణ్ . ఇప్పుడు ఆ విష‌యం తెలుసుకున్న అమ‌లాపురం ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు.


English summary
Raj Tarun was actually shooting in and around Amalapuram from some time and he's hell bent to watch DJ Duvvada Jagannadham on Day One that too the First Show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu