»   » లాస్యతో లేచిపోయి వస్తే.. హెల్ప్ చేస్తామన్నారు.. రాజ్ తరుణ్

లాస్యతో లేచిపోయి వస్తే.. హెల్ప్ చేస్తామన్నారు.. రాజ్ తరుణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యాంకర్ లాస్యతో అఫైర్‌పై మీడియాలో వచ్చిన రూమర్లపై సినీ హీరో రాజ్ తరుణ్ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు లాస్యను ఒకేసారి కలిశానని, అంతకుమించి తమ మధ్య ఏమీలేదని అన్నారు. కుమారి 21ఎఫ్ చిత్ర ఆడియో కార్యక్రమంలో తప్ప మరెప్పుడూ కలువలేదని, అప్పడు తీసిన ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు అని తెలిపారు.

యాంకర్ లాస్యతో అఫైర్ లేదు.

యాంకర్ లాస్యతో అఫైర్ లేదు.

సోషల్ మీడియాలో వచ్చిన వార్త చూసి తనకు స్నేహితులు ఫోన్ చేశారు. లాస్యతో కలిసి లేచిపోయి వస్తే తాము హెల్ప్ చేస్తాం. ఫ్రెండ్స్ సహాయం తీసుకోరా అని అన్నారు. అందుకు తాను ఇది సినిమా కాదు. లాస్యకు నాకు ఎలాంటి అఫైర్ లేదు అని వారికి స్పష్టం చేశాను అని రాజ్ తరుణ్ చెప్పారు.

అలా జరిగినా సంతోషపడి ఉండేవాడ్ని

అలా జరిగినా సంతోషపడి ఉండేవాడ్ని

ఒకవేళ అలాంటి అఫైర్ ఉండి వార్తలు వస్తే కనీసం సంతోషపడి ఉండే వాడిని అని అన్నారు. నిప్పు లేకుండా వచ్చిన పొగలాంటిందని ఆయన అన్నారు. ఫోటోలు మార్ఫింగ్ చేసిన వాడిని మెచ్చుకోవాల్సిందే అని అన్నారు. ఒక ఫోటో బాగా మార్ఫింగ్ చేశారని, మరో ఫోటో మార్ఫింగ్ చేయడానికి కుదర్లేదని చెప్పారు.

ఆ సినిమాలో పోస్టర్ అద్భుతంగా మార్ఫింగ్

ఆ సినిమాలో పోస్టర్ అద్భుతంగా మార్ఫింగ్

సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు సినిమాలోని ఫోటోను మార్పింగ్ చేసి సోషల్ మీడియలో పెట్టారు. ఫేస్‌బుక్‌లో ఆ ఫోటోలను చూసి పోనీలే అని ఊరుకొన్నా. కానీ అది వైరల్‌గా మారి గందరగోళం నెలకొనడంతో స్పందించాల్సి వచ్చింది. దాంతో ట్విట్టర్‌లో వివరణ ఇచ్చాను.

అఫైర్‌ను ఖండించిన రాజ్ తరుణ్

అఫైర్‌ను ఖండించిన రాజ్ తరుణ్

గతంలో యాంకర్ లాస్యతో అఫైర్ సాగుతున్నదని, ఆమెతో లేచిపోయి పెళ్లి చేసుకొన్నారనే వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లపై రాజ్ తరుణ్ ఖండించిన విషయం తెలిసిందే.

English summary
Raj Tarun clarifies on affair with Anchor Lasya. He said I met Lasya once in the Audio function of Kumari 21F movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu