»   »  ‘అంధగాడు’ రాజ్ తరుణ్: ఆ విషయం నన్ను అడుగవద్దు.. నేను అసలే చెప్పను.. దిల్ రాజు వల్లే..

‘అంధగాడు’ రాజ్ తరుణ్: ఆ విషయం నన్ను అడుగవద్దు.. నేను అసలే చెప్పను.. దిల్ రాజు వల్లే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావా, కుమారి 21ఎఫ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్ర విజయాల తర్వాత హీరో రాజ్ తరుణ్ తాజాగా చేస్తున్న సినిమా అంధగాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా గురించిన విశేషాలను ఆయన మీడియాతో పంచుకొన్నారు. జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటందని రాజ్ తరుణ్ ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో రాజ్ తరుణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

ఆయన నుంచి చాలా నేర్చుకొన్నాను..

ఆయన నుంచి చాలా నేర్చుకొన్నాను..

అంధగాడు సినిమాలో తొలిసారి సీనియర్ నటుడు, లెజెండ్ రాజేంద్ర ప్రసాద్‌తో నటించాను. ఆయనతో నటించడం వల్ల చాలా నేర్చుకొన్నాను. ఆయనది ఈ సినిమాలో డిఫరెంట్ పాత్ర. ఆయన పాత్ర గురించి రివీల్ చేస్తే సినిమాపై ఆసక్తి పోతుంది. రాజేంద్ర ప్రసాద్ పాత్ర అంత కీలకమైనది. ఆ పాత్ర చేసేటప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా ఎంజాయ్ చేశారు. కంప్లీట్‌గా ఆయనది డిఫరెంట్ పాత్ర. అందుకే ఆయన పాత్ర గురించి ఎక్కువగా చెప్పకూడదు. మీరు తిప్పితిప్పి అడిగినా నేను అసలే చెప్పను.


నటకిరీటి చాలా సూచనలు ఇచ్చారు..

నటకిరీటి చాలా సూచనలు ఇచ్చారు..

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ పనిచేయడం గొప్ప ఎక్సీపిరియెన్స్. కొన్ని సీన్లలో నటించేటప్పుడు ఇలా చేయ్యి.. అలా చెయ్యి అని సూచనలు ఇచ్చే వారు. ఆయన అనుభవం నాకు చాలా ఉపయోగపడింది. అంధగాడులో రాజేంద్ర ప్రసాద్‌తో నటించడం గొప్ప అనుభవం. చాలా హ్యాపీగా ఉంది. మరో చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నాకు తండ్రిగా నటిస్తున్నాడు అని రాజ్ తరుణ్ చెప్పాడు.


కథతో వచ్చి డైరెక్టర్ అయ్యాడు..

కథతో వచ్చి డైరెక్టర్ అయ్యాడు..

తొలుత అంధగాడు సినిమా స్క్రిప్ట్‌ను రైటర్‌గా వెలిగొండ శ్రీనివాస్ పట్టుకొచ్చారు. ఆయన కథ చెప్పినప్పుడు మీరే డైరెక్టర్ అయితేనే న్యాయం చేకూరుస్తారు అని నేనే చెప్పాను. ఎందుకంటే ఈ సినిమాలో అనేక ట్విస్టులు, మలుపులు, ఎమోషన్స్ ఉన్నాయి. అవన్నీ ఆయనకే తెలుసు. అందుకే ఆయన అయితేనే డైరెక్టర్‌గా ఈ సినిమాకు కరెక్ట్ అని భావించా. నిర్మాతలు కూడా అదే అభిప్రాయంతో ఉండటంతో వెలిగొండ శ్రీనివాస్ డైరెక్టర్ అయిపోయారు.


హెబ్బా పటేల్ మెచ్చురిటీ పెరిగింది..

హెబ్బా పటేల్ మెచ్చురిటీ పెరిగింది..

గత రెండు సినిమాలతో పోల్చుకుంటే హెబ్బా పటేల్ యాక్టింగ్ అంధగాడులో మెరుగుపడింది. తెలుగు భాష బాగా అర్థం చేసుకొంటున్నది. డైలాగ్ చెప్పిన వెంటనే బాగా రియాక్ట్ అవుతుంది. సెట్లో చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. గత సినిమాల్లో కంటే ఈ సినిమాల్లో హెబ్బా ఎక్కువ మెచ్చురిటీగా కనిపిస్తుంది. తెరమీద చాలా క్లియర్ ఆ తేడా కనిపిస్తుంది అని రాజ్ తరుణ్ చెప్పాడు.


అన్నపూర్ణ బ్యానర్‌లో..

అన్నపూర్ణ బ్యానర్‌లో..

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌లో ఒక చిత్రంలో నటిస్తున్నాను. ఆ చిత్రానికి రజనీ దర్శకురాలు. చిత్ర హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరో సినిమా దిల్ రాజు దర్శకత్వంలో మరో సినిమాను ఒప్పుకొన్నాను. త్వరలోనే దిల్ రాజ్ ఆ సినిమా వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. రాజుగాడు యమ డేంజర్ అనే మరో సినిమా షూటింగ్ జరుపుకొంటున్నది.


శతమానం భవతి అలా మిస్ అయింది..

శతమానం భవతి అలా మిస్ అయింది..

అప్పట్లో మూడు సినిమాల్లో నటిస్తున్నందున శతమానం భవతి సినిమా అవకాశాన్ని కోల్పోయాను. దిల్ రాజు ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనతో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఆ సినిమాను వదులుకొన్నాను. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో చాలా సంతోషపడ్డాను. అయితే నాకు దక్కలేదనే నిరుత్సాహానికి గురికాలేదు. సినిమా విజయం సాధించడం చాలా ఆనందమేసింది అని రాజ్ తరుణ్ అన్నారు. దిల్ రాజు సంస్థలో సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. ఆ అవకాశం మిస్ అయినా.. మళ్లీ అవకాశం లభించింది. త్వరలో దిల్ రాజు సినిమా ప్రారంభం కానున్నది.English summary
Tollywood hero Raj Tarun's latest movie is Andhhagadu. Hebba Patel paired third in a row. Writer Veligonda Srinivas is first director for this movie. Anil Sunkara is the producer. This movie is slated to release on June 2nd. In this occassion, Raj Tarun shared this movie's experiencess with the media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu