»   » పెళ్లి అయిపొయిందట.. చెప్పలేందేంటీ..రాజ్ తరుణ్

పెళ్లి అయిపొయిందట.. చెప్పలేందేంటీ..రాజ్ తరుణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్లతో అఫైర్లు అంటగడుతూ వచ్చే గాసిప్స్ చదివి చాలా ఆనందిస్తానని హీరో రాజ్ తరుణ్ చెప్పారు. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావా, కుమారి 21ఎఫ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్ర విజయాల తర్వాత హీరో రాజ్ తరుణ్ తాజాగా చేస్తున్న సినిమా అంధగాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా గురించిన విశేషాలతో ఆయన వ్యక్తిగత విషయాలను ఆయన మీడియాతో పంచుకొన్నారు. జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటందని రాజ్ తరుణ్ ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో రాజ్ తరుణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

గాసిప్స్ వార్తలతో హ్యాపీ..

గాసిప్స్ వార్తలతో హ్యాపీ..

హీరోయిన్లతో అఫైర్లు అంటగడుతూ నాపై బాగానే గాసిప్స్ వస్తుంటాయి. వాటిని చదివిన తర్వాత వాటిని నేను లైట్ తీసుకొంటాను. నాపై వచ్చే గాసిప్స్ చూసి నవ్వుకుంటాను. సంతోషిస్తాను. ఎందుకంటే పాపులారిటీ ఉన్న హీరోపైనే ఎక్కువగా గాసిప్స్ వస్తుంటాయి. నాకు పాపులారిటీ ఉన్నందునే గాసిప్స్ రాస్తుంటారు అని హ్యాపీగా ఫీలవుతాను అని రాజ్ తరుణ్ అన్నారు.

గాసిప్స్‌ను కంట్రోల్ చేసే వీలుండదు..

గాసిప్స్‌ను కంట్రోల్ చేసే వీలుండదు..

సాధారణంగా గాసిప్స్ వార్తలను, వెబ్‌సైట్లు రాసే కథనాలను చదవను. నీ గురించి ఇలా రాశారు అని ఎవరైనా నాకు చూపిస్తే నేను చదువుతాను. చదివిన తర్వాత చేసేదీ ఏమి ఉండదు. మనకు తెలిసిన వాళ్లు రాస్తే వారిని కంట్రోల్ చేయడానికి వీలుంటుంది. ఎవరో తెలియని వారు రాస్తే వాటిని ఆపడానికి వీలుపడదు అని రాజ్ తరుణ్ తెలిపారు.

పెళ్లి జరిగింది.. చెప్పలేదేంటీ..

పెళ్లి జరిగింది.. చెప్పలేదేంటీ..

ఓ హీరోయిన్ అఫైర్ అని, ఓ టీవీ యాంకర్‌తో పెళ్లి జరిగిందని గాసిప్స్ వచ్చాయి. అలాంటివి ఎక్కడ నుంచి వస్తాయో తెలియదు. కానీ చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఇంట్లో వాళ్లు కూడా కొన్నిసార్లు అడుగుతుంటారు. ఆ వార్తలను ఆధారంగా చేసుకొని అరే నీకు పెళ్లి అయిపోయిందంట. మాకు చెప్పలేదంటే అని నన్ను ఆటపట్టిస్తుంటారు. ఫేమ్ ఉన్నందునే ఇలాంటివి వస్తుంటాయని లోలోపల ఆనందపడుతాను.

ఓ ఇంటివాడిని అయ్యాను.

ఓ ఇంటివాడిని అయ్యాను.

నా సొంత ఊరు వైజాగ్‌లో సొంత ఇల్లే లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొనుక్కొన్నాను. ఇటీవలే ఓ ఇంటివాడిని అయ్యాను. అమ్మా, నాన్న నా దగ్గరికే వచ్చి వెళ్తుంటారు. బేసిగ్గా ఇంట్లో వాళ్లు శాఖాహారులు. నేను నాన్ వెజిటేరియన్ తింటాను. అయితే ఎన్ని రకాల చికెన్లు, మటన్లు తిన్నా.. అమ్మ చేతి వంటకు మించినది ఏదీ ఉండదు అని రాజ్ తరుణ్ చెప్పారు.

English summary
Tollywood hero Raj Tarun's latest movie is Andhhagadu. Hebba Patel paired third in a row. Writer Veligonda Srinivas is first director for this movie. Anil Sunkara is the producer. This movie is slated to release on June 2nd. In this occassion, Raj Tarun shared this movie's experiencess with the media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu