»   » నేను రిజక్ట్ చేయలేదు, దిల్ రాజు వల్లే తప్పుకున్నా: రాజ్ తరుణ్

నేను రిజక్ట్ చేయలేదు, దిల్ రాజు వల్లే తప్పుకున్నా: రాజ్ తరుణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన హీరో రాజ్ తరుణ్ అనతి కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస హిట్లతో గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. త్వరలో కిట్టూఉన్నాడు జాగ్రత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రాజ్ తరుణ్.

ఈ మధ్య దిల్ రాజు బేనర్లో వచ్చిన 'శతమానం భవతి', 'నేను లోకల్‌' సినిమాలు రాజ్‌తరుణ్‌ చేయాల్సినవేనని, ఆ కథలు నచ్చక రిజెక్ట్‌ చేశాడని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై తాజాగా రాజ్ తరుణ్ వివరణ ఇచ్చారు.


దిల్ రాజు వల్లే

దిల్ రాజు వల్లే

‘సినిమా చూపిస్తా మావ' సినిమా దర్శకనిర్మాతలు ‘నేను లోకల్‌' కథ నాకు వినిపించిన మాట వాస్తవమే. నేను కూడా ఆ సినిమా చేయాలనే డిసైడ్ అయ్యాను. అయితే దిల్‌ రాజుగారు ఆ కథ హీరో నానికి అయితే బాగుంటుందని చెప్పారు. దాంతో నేను ఓకే చెప్పి సైడ్ అయిపోయాను అని రాజ్ తరుణ్ తెలిపారు.


శతమానం భవతి విషయంలో

శతమానం భవతి విషయంలో

‘శతమానం భవతి' కథ కూడా నాకు చెప్పారు. నాకు నచ్చింది. అయితే ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలి వెంటనే డేట్స్ కావాలన్నారు. నానే వేరే మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో డేట్లు అడ్జెస్ట్‌ చేయడం కుదరలేదు. అలా ఆ సినిమా నా చేజారింది. దిల్ రాజుగారి బేనర్లో సినిమాలు వద్దని ఎవరూ అనుకోరు. త్వరలోనే ఆయతో సినిమా చేయబోతున్నానని తెలిపారు రాజ్ తరుణ్


కుక్క‌ల‌తో కలిసి సినిమా చేయ‌డంపై

కుక్క‌ల‌తో కలిసి సినిమా చేయ‌డంపై

రాజ్ తరుణ్ నటిస్తున్న కిట్టూ ఉన్నాడు జాగ్రత్త మార్చి 3న విడుద‌లకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ ప్రమోషన్లలో బిజీ అయ్యారు. సినిమాలో కుక్క‌ల‌తో కలిసి సినిమా చేయ‌డం పెద్ద క‌ష్ట‌మ‌నిపించ‌లేదు అని రాజ్ తరుణ్ తెలిపారు.


ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ గురించి

ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ గురించి

ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ మేకింగ్ వాల్యూస్‌కు పెద్ద పీట వేస్తారు. ఈ సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుండి ఎండింగ్ అయ్యే వ‌ర‌కు, ఎంట‌ర్‌టైన్మెంట్ మాత్ర‌మే క‌న‌ప‌డుతుంది. అవుటండ్ అవుట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌` సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుందని రాజ్ తరుణ్ తెలిపారు.


పాట రాయడంపై

పాట రాయడంపై

సినిమాలో అనుకోకుండా అనుకోకుండా జానీ జానీ ..పాట ట్యూన్ విని పాట రాశాను. పాట రాయ‌డం యాదృచ్చిక‌మే. ఆ పాట డైరెక్ట‌ర్‌కు న‌చ్చ‌డంతో ఆ పాట‌నే సినిమాలో పెట్టేశారు అని రాజ్ తరుణ్ తెలిపారు.


సల్మాన్ ఖాన్ సోదరుడు

సల్మాన్ ఖాన్ సోదరుడు

హీరో అను ఇమ్మాన్యుయ‌ల్ అద్భుతంగా న‌టించింది. సినిమాలో విల‌న్ క్యారెక్ట‌ర్‌కు ఓ స్ట్రెచ‌ర్ ఉండాల‌నుకున్న‌ప్పుడు అర్బాజ్ ఖాన్‌గారు గుర్తుకు వ‌చ్చారు. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్ళేట‌ప్పుడు ఆయ‌న చేస్తారో, చేయ‌రోన‌ని అనుకున్నాం. కానీ ఆయ‌న క‌థ విన‌గానే ఒప్పుకున్నారు. అద్భుతంగా న‌టించారు అని రాజ్ తరుణ్ తెలిపారు.


అనూప్‌తో చేయ‌డం ఇప్ప‌టికి కుదిరింది

అనూప్‌తో చేయ‌డం ఇప్ప‌టికి కుదిరింది

ఈ సినిమాలో చాలా డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌తో న‌టించాను. ఉయ్యాలా జంపాల త‌ర్వాత అనూప్‌ను క‌లిశాను. అప్ప‌టి నుండి త‌న‌తో ప‌నిచేయాల‌నుకుంటున్నాను. త‌ను మంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. మంచి క్వాలిటీ మ్యూజిక్ ఇస్తాడు. ఈ సినిమాలో త‌న‌తో కలిసి ప‌నిచ‌య‌డం ఆనందంగా ఉంది అన్నారు


జానీ జానీ ఎస్ పప్పా... డక్రింగ్ వోడ్కా నో పప్పా

‘జానీ జానీ ఎస్ పప్పా... డ్రింకింగ్ వోడ్కా నో పప్పా' అంటూ సాంగే ఈ సాంగ్ లిరిక్స్ కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.


అర్థమైందా సాంగ్

ప్రేమికుల రోజు సందర్భంగా అర్ధమైందా సాంగ్ రిలీజ్ అయింది. రాజ్ తరుణ్ సినిమాలపై ఇప్పటికే చాలా మందిలో క్రేజ్ నెలకొంది. ఈ సాంగ్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి.


ఆకట్టుకున్న ట్రైలర్

ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. సినిమా తప్పకుండా సూపర్ హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారంతా.


ముద్దు సీన్

ముద్దు సీన్

'ఉయ్యాల జంపాల'తో అనుకోకుండా హీరో అయిపోయిన రాజ్‌తరుణ్‌, 'కుమారి 21 ఎఫ్‌', సినిమా చూపిస్తా మావా తదితర చిత్రాలతో యంగ్‌ హీరోల రేసులోకి వచ్చేసి, వరస హిట్స్ తన ఉనికిని బాగానే చాటుకుంటున్నాడు. ఈ యంగ్ జనరేషన్ హీరోల లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. హీరోగా మంచి విజయాలు సాధిస్తున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.


English summary
Check out Raj Tarun Kittu Unnadu Jagratha Movie Interview. Starring Raj Tarun, Anu Emmanuel. Music composed by Anup Rubens, Directed by Vamsi Krishna, Produced by A.K.Entertainments as Production no.8.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu