»   » రాజ్ తరుణ్ మూవీ ‘రాజుగాడు’ రిలీజ్ డేట్ ఫిక్స్

రాజ్ తరుణ్ మూవీ ‘రాజుగాడు’ రిలీజ్ డేట్ ఫిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం "రాజుగాడు". సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటిస్తోంది. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై విశేషమైన ఆదరణ చూరగొనడంతోపాటు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ.. "రాజ్ తరుణ్ మా బ్యానర్ లో చేస్తున్న నాలుగో చిత్రమిది. సంజనా రెడ్డి చాలా చక్కగా తెరకెక్కించింది. హీరో క్యారెక్టరైజేషన్, రాజేంద్రప్రసాద్ గారి కామెడీ ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. విడుదలైన టీజర్ మరియు పోస్టర్స్ కి మంచి స్పందన లభించింది. మే 11న చిత్రాన్ని విడుదల చేయాలనుకొంటున్నాం. త్వరలోనే ఆడియోను విడుదల చేస్తాం. మా బ్యానర్ లో "రాజుగాడు" మరో హిట్ సినిమాగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది" అన్నారు.

Raj Taruns Raju Gadu Release date

రాజ్ తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు, రావురమేష్, సిజ్జు, పృధ్వీ, కృష్ణ భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్యా, ఖయ్యుమ్, అదుర్స్ రఘు, అభి ఫిష్ వెంకట్, గుండు సుదర్శన్, పూజిత, సితార, మీనాకుమారి, ప్రమోదిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్, మూల కథ: మారుతి, మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, స్టిల్స్: రాజు, మేకప్: రామ్గా, కాస్ట్యూమ్స్: శివ-ఖాదర్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్-రియల్ సంతోష్, కొరియోగ్రఫీ: రఘు-విజయ్, ఆర్ట్: కృష్ణ మాయ, చీఫ్ కో డైరెక్టర్: ప్రసాద్ దాసం, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, సినిమాటోగ్రాఫర్: బి.రాజశేఖర్, సంగీతం: గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర-డా.లక్ష్మారెడ్డి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం:" సంజనా రెడ్డి.

English summary
Raj Tarun's "Raju Gadu" Releasing on May 11th. After hat-trick hits like Eedo Rakam Aado Rakam , Kittu Unnadu Jagratha and Andhhagadu , Raj Tarun and producer Anil Sunkara are getting ready to entertain the audience once again with another complete entertainer. Raju Gadu , directed by debutante Sanjana Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X