»   » వామ్మో...మామూలోడు కాదు: యాంకర్ సుమ కు సూపర్ షాకిచ్చాడు

వామ్మో...మామూలోడు కాదు: యాంకర్ సుమ కు సూపర్ షాకిచ్చాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ సుమ వాక్ప్రవాహం మామూలుగా ఉండదు. జన్మతహ మళయాళి అయినా ఆమె తెలుగు భాష మీద విపరీతమైన పట్టు ఉంది. తడుముకోకుండా ఆమె ఇచ్చే కౌంటర్స్ కు అవతలవాళ్ళకు దిమ్మ తిరిగేలా ఉంటాయి. అదే సమయంలో ఫన్నీగానూ అలరించేలా ఉంటాయి. అందుకే ఆమె హీరోయిన్లతో సమానంగా సూపర్‌ పాపులర్‌ అయిపోయింది.

తన వాక్ చాతుర్యంతో ఇటు టీవీ పోగ్రామ్ లల్లోనే కాకుండా సినిమా ఆడియో ఫంక్షన్లలోనూ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. అలాంటి సుమకు ఇటీవల జరిగిన 'శతమానం భవతి' ఆడియో ఫంక్షన్‌లో షాకిచ్చాడు యువ హీరో రాజ్‌తరుణ్‌.

Raj Tarun Strong Punch to Anchor Suma at Shatamanam Bhavati

ఈ సినిమా పెళ్లికి సంబంధించిన కాన్సెప్ట్‌ ప్రకారం తెరకెక్కినది కావడంతో.. వచ్చిన అతిథులందరినీ 'మీ పెళ్లెప్పుడు' అని అడిగి ప్రశ్నలు రాబట్టింది సుమ.

యువ హీరో రాజ్‌తరుణ్‌ వేదికపైకి రాగానే.. అందరిలాగానే 'నీకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా' అని ప్రశ్నంచింది. దీనికి రాజ్‌తరుణ్‌.. 'ఇప్పటికీ మీకు పెళ్లి కాకుండా ఉండి ఉంటే.. ఆ ఆలోచన ఉండేది. ఇప్పుడు పెళ్లి ఆలోచన లేదు'అని తడుముకోకుండా వెంటనే సమాధానమిచ్చాడు.

ఈ జవాబుకు సుమతో పాటు అక్కడికి వచ్చిన గెస్ట్ లు అంతా షాకయ్యారు. వెంటనే తేరుకున్న సుమ రాజ్‌తరుణ్‌కు 'హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌' అని చెప్పి పంపించింది.

చిత్రం విశేషాలకు వస్తే...'ఎక్స్ ప్రెస్ రాజా' వంటి కమర్షియల్ సక్సెస్ తరువాత యంగ్ హీరో శర్వానంద్ చేస్తున్న కుటుంబ కథా చిత్రం 'శతమానం భవతి'. వేగేశ్న సతీష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

ఈ చిత్రం 'బొమ్మరిల్లు' తరహాలో తనకు గొప్ప విజయాన్ని అందిస్తుందని, అందుకే ఇది తనకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని దిల్ రాజు మొదటి నుండి ధీమాగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 'ఖైదీనెం 150, గౌతమీపుత్రశాతకర్ణి' వంటి పెద్ద సినిమాలతో పాటు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ చిత్రానికి సంబందించిన ఆడియో కార్యక్రమాన్ని నిర్మాత దిల్ రాజు పుట్టినరోజైన ఈరోజు సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే అందుకు సంబందించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్ గా ఈ చిత్ర ఆడియో విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టుకుంటోంది.

మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా శర్వానంద్ సరసన అనుపమ్ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో తాత, మనవళ్ల మధ్య నడిచే సెంటిమెంట్ ప్రధానాంశంగా ఉండనుంది.

English summary
Raj Tarun Shocking Comments On Anchor Suma Sathamanam Bhavathi Movie Audio Launch Sharwanand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu