twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెమ్యూనరేషన్ పెంచుతా, సునీల్ కోసం కథ రాసా: హీరో రాజ్ తరుణ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ వరుస విజయాలతో కుర్ర హీరో రాజ్ తరుణ్ దశ తిరిగింది. వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. మరో రెండేళ్ల వరకు రాజ్ తరుణ్ డేట్స్ ఖాళీ లేకుండా అయ్యాయి. ఈ నెల 20న ‘కుమారి 21 ఎఫ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

    అయితే ‘కుమారి 21ఎఫ్' మూవీకి సెన్సార్ బోర్డ్ ‘ఎ' స్టిఫికెట్ ఇవ్వడంతో ఈ సినిమా కొందరి మాత్రమే పరిమితం అనే ప్రచారం మొదలైంది. దీనిపై రాజ్ తరుణ్ స్పందిస్తూ... ఈ సినిమా అందరూ చూడదగ్గ సినిమా. ‘ఎ' సర్టిఫికెట్ వచ్చినంత మాత్రాన ఫ్యామిలీ ప్రేక్షకులు దూరంగా ఉండాలనే అర్థం కాదు అన్నాడు.

    వరుస విజయాలతో రెమ్యూనరేషన్ పెంచుతారా? అనే ప్రశ్నకు రాజ్ తరుణ్ స్పందిస్తూ... ‘కుమారి 21 ఎఫ్' విజయం సాధిస్తే తప్పకుండా రెమ్యూనరేషన్ పెంచుతాను అన్నారు. వాస్తవానికి రాజ్ తరుణ్ డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీకి వచ్చాడు. సునీల్ ను దృష్టిలో పెట్టుకుని ఓ కథ కూడా రాసాడు. అన్నీ సజావుగా సాగితే దర్శకుడిగా మారి సునీల్ తో సినిమా చేస్తాను అంటున్నాడు.

    ‘కమారి 21 ఎఫ్' తర్వాత రాజ్ తరుణ్ రామ్ గోపాల్ వర్మతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. దీంతో పాటు గీతా ఆర్ట్స్ బేనర్లో ఓ సినిమా, వంశీ దర్శకత్వంలో లేడీస్ టైలర్ రీమేక్, మంచు విష్ణుతో ఓ సినిమా చేయడానికి కమిట్ అయియ్యాడు. రాజ్ తరుణ్ తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోగా ఎదుగుతాడు అంటున్నారు విశ్లేషకులు.

     Raj Tharun will hike Remuneration

    ‘కుమారి 21 ఎఫ్' విషయానికొస్తే...
    రాజ్‌ తరుణ్‌, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన చిత్రం 'కుమారి 21ఎఫ్‌'. ఈ చిత్రం కథని సుకుమార్ రాసి నిర్మిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. దీవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

    నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కౄఎష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్, సమర్పణ: సుకుమార్, నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి,కథ,స్కీన్‌ప్లే-మాటలు: సుకుమార్, దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్.

    English summary
    When asked did he hike his pay package, The Youngster Raj Tharun said he might think about if 'Kumari 21F' hits the bull's eye.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X