»   » మొత్తానికి నందమూరి ఫ్యామిలీలోచేరిపోయాడుగా...!

మొత్తానికి నందమూరి ఫ్యామిలీలోచేరిపోయాడుగా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయవాడ: నారా రోహిత్ ఇండస్ట్రీకి చాలా కాలం అయినా సరైన హిట్టు లేదు... సరైన ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలో నెగ్గుకురావాలంటే ఏం చేయాలో నారా రోహిత్ గ్రహించినట్లున్నాడు. అందుకే నందమూరి అభిమానులకు దగ్గయ్యాడు. బాలయ్య అండతో ఇక అతని జర్నీ సినిమా రంగంలో విజయవంతంగా సాగుతుందని అంటున్నారంతా.

నారా రోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'రాజా చెయ్యి వేస్తే'.ఈగ', 'అందాల రాక్షసి', 'లెజండ్', 'ఊహలు గుసగుసలాడే', 'దిక్కులు చూడకు రామయ్యా' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం 'ఈగ' తో నేషనల్ స్థాయి అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వారాహిచలనచిత్రం బ్యానర్ పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఈ చిత్రంలో నందమూరి తారకరత్న విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ లాంచ్ కార్యక్రమం విజయవాడలో జరిగింది. టి.ఎన్.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో రవినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నారా, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. ఈ మార్చి 25న విజయవాడలో జరగనున్న ఆడియో వేడుకకు భారీ ఎత్తున్న సన్నాహాలు చేస్తున్నట్లు అభిమానులు తెలియజేశారు.​

English summary
Raja Cheyyi Vesthe is an upcoming Telugu Movie, Which is directed by debutante Pradeep and It is produced by Sai Korrapati under the banner of Varahi Chalana Chitram. The movie Starring Nara Rohit and Isha Talwar playing a lead role in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu